ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు.
ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. శనివారం హైదరాబాద్లో జి.శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రజలకు అన్ని సమయాల్లో అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
పార్టీని బలోపేతం చేసేందుకు మరింత దృష్టి సారిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 67 స్థానాలను కైవసం చేసుకుంది. రెండు అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా టీడీపీ వందకు పైగా స్థానాలను గెలిచి మొదటి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. దాంతో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.