
నాకేదైనా జరిగితే చంద్రబాబు, పవన్‌లదే బాధ్యత
బంజారాహిల్స్: తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తనకు ఏదైనా జరిగితే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేరంగుల ఉదయ్‌కిరణ్ అన్నారు. జూబ్లీహిల్స్‌లోని తానీషా హోటల్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌లను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసినందుకు గుర్తు తెలియని వ్యక్తులు తన కుమార్తెను కిడ్నాప్ చేసేందుకు యత్నించారని ఆరోపించారు. ఈ విషయంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో సెంట్రల్ హోమ్ సెక్రెటరీకి ఫిర్యాదు చేశానని చెప్పారు.
దీనికి స్పందించిన కేంద్రం తనకు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సూచించినా పట్టించుకోలేదన్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లలో కూడా ఫిర్యాదు చేయగా.. పోలీసులను నివేదిక కోరగా తప్పడు నివేదిక ఇచ్చారన్నారు. దీంతో తాను హైకోర్టులో పిటిషన్ వేయగా.. స్వీకరించిన కోర్టు ఆగస్టు 22 లోపు వివరణ ఇవ్వాలని ఏపీ డీజీపీని ఆదేశించిందన్నారు. ఇప్పుడు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తనకు ఏదైనా జరిగితే చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌లే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఉదయ్‌కిరణ్ అన్నారు.