సభ ముందుంచిన సభా హక్కుల సంఘం ఛైర్మన్
బుద్ధప్రసాద్ కమిటీ, సభా హక్కుల కమిటీ సిఫార్సులతో నివేదిక
ఎమ్మెల్యే కొడాలి నానిపై చర్య తీసుకునే అంశంపై నిర్ణయం సభకే.
రోజాను సభ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేయాలని సిఫారసు.
బుద్ధప్రసాద్ కమిటీ నివేదికతో ఏకీభవించిన సభా హక్కుల సంఘం.
సభ ముందుంచిన సభా హక్కుల సంఘం ఛైర్మన్
బుద్ధప్రసాద్ కమిటీ, సభా హక్కుల కమిటీ సిఫార్సులతో నివేదిక
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే వి.అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏర్పాటైన మండలి బుద్ధప్రసాద్ కమిటీ, సభా హక్కుల కమిటీ నివేదికలను సభా హక్కుల సంఘం ఛైర్మన్ జి.సూర్యారావు సోమవారం అసెంబ్లీ ముందుంచారు. బుద్ధప్రసాద్ కమిటీ చేసిన సిఫార్సులను, వాటిపై చర్చించి సభా హక్కుల సంఘం చేసిన సిఫార్సులను, అనిత ఇచ్చిన ఫిర్యాదును, రోజా రాసిన ఉత్తరాలను కలిపి ఓ నివేదిక రూపంలో ఆయన సభకు సమర్పించారు. ఈ నివేదికలోని ముఖ్యమైన అంశాలు...
సభా హక్కుల సంఘం సిఫార్సులు
గతేడాది డిసెంబర్ 18న సభలో ఉపయోగించిన భాషపై ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కె.శ్రీధర్‌రెడ్డి విచారం వ్యక్తం చేసినందున వారిని నిర్దోషులుగా ప్రకటించింది.
ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావుపై చర్య తీసుకునే అంశాన్ని సభకు వదిలి వేసింది.
రోజాను సభ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేయాలని సిఫార్సు చేసింది.
రోజాకు సంబంధించి మండలి బుద్ధప్రసాద్ కమిటీ ఇచ్చిన నివేదికతో సభా హక్కుల సంఘం ఏకీభవించింది.
మండలి బుద్ధప్రసాద్ కమిటీ సిఫార్సులు
రోజా, కొడాలి నాని తమ పరిధి మీరి అప్రజాస్వామిక భాష మాట్లాడి సభా నిబంధనలను ఉల్లంఘించినందున వారిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది.
చెవిరెడ్డి భాస్కర్‌రావు, కె.శ్రీధర్‌రెడ్డి, జ్యోతుల నెహ్రూలను తీవ్ర హెచ్చరికలతో వదిలివేయాలి. భవిష్యత్‌లో అటువంటి ప్రవర్తన పునరావృతం కాకుండా చూసుకోమని హెచ్చరించాలి.
ప్రతిపక్ష సభ్యుల్నే కాకుండా సభ సజావుగా జరగకుండా పదేపదే వ్యాఖ్యలు చేస్తున్న అధికార పక్ష సభ్యులను కూడా తీవ్రంగా హెచ్చరించాలి. అవసరమైతే మందలించాలి.
వీడియో ఫుటేజీకి సంబంధించి..
సభా వ్యవహారాల వీడియో రికార్డింగ్, ప్రత్యక్ష ప్రసారాలు తదితర అంశాలను క్షుణ్నంగా పరిశీలించి ఎలాంటి లీకేజీలు లేకుండా చేయడానికి సమగ్ర యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని బుద్ధప్రసాద్ కమిటీ సూచించింది. ఇదే సమయంలో సభా నిర్వహణ సజావుగా సాగేందుకు కొన్ని సూచనలు, సలహాలను ఇచ్చింది. సభ లేదా గ్యాలరీలలోకి సెల్‌ఫోన్లు, పేజర్లు, క్యాసెట్లు, టేప్ రికార్డర్లు తీసుకెళ్లకుండా నిరోధించాలని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని పేర్కొంది.
ఆ నివేదికలో ఏముందంటే?
Published Tue, Mar 22 2016 7:25 AM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM
Advertisement
Advertisement