రోహిత్ వేముల తల్లి రాధిక ఆవేదన
విజయవాడ: కుమారుడిని పోగొట్టుకొని తాను కుమిలిపోతుంటే, తన బిడ్డ చావుకు కారణమైన వారు మాత్రం దర్జాగా తిరుగుతున్నారని రోహి త్ వేముల తల్లి రాధిక ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రభుత్వాలు ఏమని సమాధానం చెబుతాయని ప్రశ్నించా రు. గవర్నర్‌పేట మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో 5వ ఆలిండియా మహిళా సదస్సు ప్రారంభమైంది.
కార్యక్రమానికి ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా..రాధిక వేముల, ఢిల్లీ జేఎన్‌యూ ఉపా«ధ్యక్షురాలు దీప్సి తాదర్, కార్యదర్శి శత్రుభ, మహిళా సెల్ కన్వీనర్ ఉమారాణి తదితరులు ప్రసంగించారు. దళితులకు, మహిళలకు ప్రత్యేక చట్టాలు ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంతో వారిపై దాడులు జరుగుతున్నాయని రాధిక వేముల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్ ఐ ఆలిండియా అధ్యక్ష కార్యదర్శులు వీపీ సాను, విక్రంసింగ్, త్రిపుర మహిళా కన్వీనర్ సౌదా, ఏపీ మహిళా కన్వీనర్ చిన్నారి, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నూర్‌మహ్మద్ తదితరులు పాల్గొన్నారు.