ముస్లిం రిజర్వేషన్లపై జాప్యమెందుకు?
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రశ్న
- ఇప్పటిదాకా అమలు చేయనందుకు క్షమాపణ చెప్పాలి
- సాకులు చెప్పకుండా వెంటనే రిజర్వేషన్లు అమలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లను అమలు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు జాప్యం చేశారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. టీపీసీసీ విస్తృతస్థాయి సమా వేశం శుక్రవారం గాంధీ భవన్‌లో జరిగింది. ప్రధాన ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ తదితరులతో కలసి సమావేశం వివరాలను ఉత్తమ్ మీడి యాకు వివరించారు.
ముస్లింలకు, గిరిజ నులకు 12 శాతం చొప్పున రిజర్వేషన్లను కల్పిస్తామని హామీని ఇచ్చారని, ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. అధికారం లోకి వచ్చిన వెంటనే రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ మూడేళ్లుగా ఎందుకు జాప్యం చేశారో సమాధానం చెప్పాలన్నారు. బీసీలకు, దళితులకు కూడా వారి జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కు ను టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాలరాసిందని ఉత్తమ్ విమర్శించారు.
ముస్లింలకు, ఎస్టీలకు రిజర్వేషన్ల విషయంలో మూడేళ్లు గా కాల యాపన చేసిన సీఎం కేసీఆర్ రాజకీయ దురుద్దేశంతో తప్ప చిత్తశుద్ధితో పనిచేయడంలేదని విమర్శించారు. టీఆర్‌ఎస్ వ్యవహరిస్తున్న తీరును, సీఎం కేసీఆర్ మోసాన్ని శాసనసభలోనే ఎండగడ తామని ఉత్తమ్ ప్రకటించారు. బీసీలకు క్రిమీలేయర్ అడ్డంకులను తొలగించాలన్నా రు. సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలో మేరకు వాల్మీకి బోయలను, కాయితీ లంబాడీలను ఎస్టీల్లో కలపాలని డిమాండ్ చేశారు. ఈ విష యంలో రాజకీయ ప్రయోజనాలు పొంద డానికి టీఆర్‌ఎస్, బీజేపీ మిత్రపక్షాలేనని ఉత్తమ్ ఆరోపించారు. రిజర్వేషన్లను ఇప్పటి దాకా అమలు చేయని సీఎం క్షమాపణలను చెప్పాలని, ఎలాంటి సాకులు చెప్పకుండా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సున్నితమైన అంశం.. జాగ్రత్తగా వ్యవహరించాలి
ముస్లింలకు రిజర్వేషన్లు సున్నితమైన రాజకీయ అంశమని, దీనిపై జాగ్రత్తగా వ్యవహరిం చాలని టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. దీనికి వ్యతిరేకంగా మాట్లాడితే రాజకీయంగా నష్టం జరుగుతుందని, అందుకని మద్దతుగా మాట్లాడుతూనే టీఆర్‌ఎస్ వైఖరిని ఎండగట్టాలని పలువురు సూచించారు. ప్రాజెక్టుల విషయంలో అడ్డుపడు తున్నారంటూ ఇప్పటికే కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్న టీఆర్‌ఎస్ పట్ల ముస్లిం రిజ ర్వేషన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీనియర్లు హెచ్చరించారు. ఇంకా సాకులు చెప్పకుండా ముస్లింలకు, ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఒత్తిడి తీసుకు రావాలని నిర్ణయించారు. హామీలను అమలు చేయకుండా రాజకీయ ప్రకటనలతో కాలం వెళ్లదీస్తున్న సీఎంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రచారాన్ని సాగించాలని నిర్ణయించారు.