
ప్రేమ నిరాకరించిందని... నిప్పుంటించుకున్నాడు
హైదరాబాద్: నగరంలోని సైదాబాద్లో ప్రేమోన్మాది శుక్రవారం వీరంగం సృష్టించాడు. గత కొంతకాలంగా తనను ప్రేమించాలంటూ ఓ యువతిని స్థానికంగా నివసిస్తున్న యువకుడు వేధించసాగాడు. అందుకు ఆమె నిరాకరిస్తూ వస్తుంది. అలాగే శుక్రవారం కూడా సదరు యువతి వెంటపడి యువకుడు వేధించసాగాడు.
దాంతో ఆగ్రహించిన యువతి... యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో యువకుడు వంటిపై పెట్రోల్ పోసుకుని... నిప్పుంటించుకున్నాడు. దీంతో అతడి శరీరంలో చాలా భాగం కాలిపోయింది. అతడు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.