రాజమండ్రి చేరుకున్న వైఎస్ జగన్ | YS jagan mohan reddy reached rajahmundry for yuvabheri in Kakinada | Sakshi
Sakshi News home page

రాజమండ్రి చేరుకున్న వైఎస్ జగన్

Published Wed, Jan 27 2016 10:53 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

రాజమండ్రి చేరుకున్న వైఎస్ జగన్ - Sakshi

రాజమండ్రి చేరుకున్న వైఎస్ జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి రాజమండ్రి బయల్దేరి వెళ్లారు.

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి రాజమండ్రి బయల్దేరి వెళ్లారు.  మధురపూడిలోని రాజమహేంద్రవరం విమానాశ్రయం చేరుకున్న ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి వైఎస్ జగన్ రోడ్డు మార్గం ద్వారా నేరుగా కాకినాడ బయల్దేరారు.

 

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై ప్రజలను దగా చేస్తున్న టీడీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టి రాష్ట్రానికి సంజీవనిలాంటి 'హోదా'ను సాధించడమే లక్ష్యంగా యువ'భేరీ మోగనుంది.  రాష్ట్ర విభజనతో అన్నివిధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ మేరకు...ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ పథంలో పయనిస్తున్న విషయం తెలిసిందే.

►10.30 గంటలకు కాకినాడలోని అంబేద్కర్ భవన్‌కు చేరుకుంటారు.
► అక్కడ యువభేరి కార్యక్రమంలో విద్యార్థులు, యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
► మధ్యాహ్నం 3 గంటలకు జేఎన్‌టీయూ సమీపంలోని బిల్డింగ్ సొసైటీ స్థలంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.
►మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, యువ నాయకుడు ముత్తా శశిధర్‌లను పార్టీలోకి ఆహ్వానిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement