
కాకినాడలో వైఎస్ఆర్ సీపీ యువభేరి
ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన యువభేరి కార్యక్రమం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యువభేరికి హాజరయ్యారు. కాకినాడలోని అంబేద్కర్ భవన్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విద్యార్థులు, యువత, విద్యావేత్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
అంతకు ముందు వైఎస్ జగన్...సభా వేదికపై ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి, సరస్వతి దేవి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన ప్రత్యేక హోదా, దాని వల్ల వచ్చే ప్రయోజనాలపై నిరుద్యోగులు, విద్యార్థులకు సభలో వైఎస్ జగన్ వివరించనున్నారు.