'మనిషన్నాక చీము, నెత్తురు, సిగ్గుండాలి'
హైదరాబాద్ : మనిషి అన్నాక చీము, నెత్తురు, సిగ్గు ఉండాలని, మోసాలు, మభ్య పెట్టడాలు, వెన్నుపోటు పొడవడాలు మీకే చెల్లుతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుప తెన్నులపై ప్రెస్మీట్లో మాట్లాడారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును ప్రజలకు వివరించారు. భూముల లీజుల విషయంలో సీఎం అనుసరిస్తున్న విధానాన్ని వైఎస్ జగన్ తప్పుబట్టారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడికి విశాఖ జిల్లాలో రూ.లక్ష చొప్పున 498 ఎకరాల భూమిని కేటాయించారని ఆయన తెలిపారు.
వైఎస్ జగన్ ప్రెస్మీట్ వివరాలు....
* బాలకృష్ణ వియ్యంకుడికి రూ.లక్ష చొప్పున 489 ఎకరాల భూమిని కేటాయించారు
* మార్కెట్ విలువ ఎకరాకు రూ.50 లక్షలు ఉంది
* 2013లోనే అప్లయి చేసుకున్నారని, ఇప్పుడు తాము ఇచ్చామని చంద్రబాబు చెప్తున్నారు
* ఇప్పుడు ఆ భూమిని ఇవ్వడానికి అప్పటి ప్రభుత్వాలు భయపడ్డాయి
* ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా?
* రూ.250 కోట్ల భూమిని బావమరిది వియ్యంకుడికి కట్టబెట్టారు
* చిత్తూరు జిల్లా కరంబాడిలో గల్లా అరుణకు 21.6 ఎకరాల భూమి కేటాయించారు
* ఎకరాకు రూ.22 లక్షలకు కేటాయించారు
* మార్కెట్ రేటు రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్లు ఉంది
* 2009 నుంచి ఈ ప్రతిపాదన పెండింగ్లో ఉందని చంద్రబాబు చెప్తున్నారు
* ఇంత దారుణమైన రేట్లకు ఇవ్వడానికి అప్పటి ముఖ్యమంత్రులు భయపడ్డారు
* విశాఖలో 50 ఎకరాల భూమిని రూ.50 లక్షల ఐపీఐఐసీకి బదిలీ చేశారు
* ఈ భూమి ఐపీఐఐసీ నుంచి ఇదే రేటును బినామీలకు బదిలీ చేస్తున్నారు
* వాస్తవంగా ఇక్కడ మార్కెట్ రేటు ఎకరాకు రూ.15 కోట్లు
*శ్రీకాకుళం టౌన్లో టీడీపీ కార్యాలయం కోసం తనంతట తానే చంద్రబాబు భూములు కేటాయించుకుంటున్నారు
*కాకినాడలో కూడా ఇలానే 99 ఏళ్ల లీజుకు భూమిని కేటాయించారు
* సీఆర్డీఏ పరిధిలో స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో నామినేషన్ విధానంలో భూములు కేటాయించారు
* రాజధాని నిర్మాణాన్ని సింగపూర్ ప్రభుత్వం చేస్తుందనే భ్రాంతి చంద్రబాబుకు మొదట కల్పించారు
* కానీ ఇప్పుడు ఆ దేశ కంపెనీలకు పూర్తిగా అప్పగించడానికి రెడీ చేశారు
* నామినేషన్ పద్ధతిలో ఈ భూములన్నీ కట్టబెడుతున్నారు
* స్విస్ ఛాలెంజ్ అనే దొడ్డిదారిన ఇస్తున్నారు
*99 ఏళ్ల లీజుకు ఏకంగా కట్టబెట్టేశారు