ఘోర ప్రమాదం 23 మంది మృతి
ఘోర ప్రమాదం 23 మంది మృతి
Published Sat, Sep 24 2016 9:37 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
ముజఫరాబాద్: పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండ ప్రాంతంలో వెళ్తున్న ఓ మినీ బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాందంలో బస్సులో ప్రయాణిస్తున్న 23 మంది మృతి చెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ముజఫరాబాద్కు ఉత్తర దిశగా 45 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. అదుపుతప్పిన బస్సు.. సుమారు 100 మీటర్ల ఎత్తునుంచి వేగంగా ప్రవహిస్తున్న నదిలో పడటంతో కొట్టుకుపోయిందని తెలిపారు. ఈ ప్రమాదంలో 23 మందికి పైగానే మృతిచెందారని, తీవ్రంగా గాయపడిన ముగ్గురిని రక్షించడంతో పాటు.. ముగ్గురి మృతదేహాలు మాత్రం లభించాయని స్థానిక అధికారి గిలానీ వెల్లడించారు. నదిలో కొట్టుకుపోయిన బస్సుతో పాటు మృతదేహాలకోసం గాలింపు కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.
Advertisement
Advertisement