ఇజ్రాయిల్ దాడుల వల్ల గాజాలో గత 48 గంటల్లో తొమ్మిది మంది చిన్నారులు మృతి చెందారని యూనిసెఫ్ ఉన్నతాధికారి వెల్లడించారు.
ఐక్యరాజ్యసమితి: ఇజ్రాయిల్ దాడుల వల్ల గాజాలో గత 48 గంటల్లో తొమ్మిది మంది చిన్నారులు మృతి చెందారని యూనిసెఫ్ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ దాడుల వల్ల ఇప్పటి వరకు మొత్తం 469 మంది మరణించారని చెప్పారు. దాడులతో గాజాలో పరిస్థితి దారుణంగా తయారైందని తెలిపారు.
రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులే కొనసాగితే స్థానికంగా ఉన్న చిన్నారులపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. గాజాలో చిన్నారుల మిగలక పోయినా అశ్చర్యపడవలసిన పని లేనదని అన్నారు. దాడులతో తీవ్ర గాయాలవుతున్నవారి సంఖ్య కూడా అధికంగా ఉందని వివరించారు.