
ఫ్రాన్స్‌లో మరో ఉగ్రదాడి: 84 మంది మృతి
ఫ్రాన్స్: ఫ్రాన్స్‌లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం బాస్టిల్ డే సందర్భంగా నరమేధానికి పాల్పడ్డారు. నీస్ నగరంలో బాస్టిల్ డే ఉత్సవాల్లో పాల్గొన్న జనాలపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 84 మంది మృతి చెందగా.. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 18మంది పరిస్థితి విషమంగా ఉంది. జాతీయ దినోత్సవం ఉత్సవాల్లో భాగంగా బాణాసంచా వెలుగులను వీక్షిస్తున్న జనాలపైకి ఉగ్రవాదులు అతివేగంతో ట్రక్కును నడిపారు. ట్రక్కులో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ట్రక్కు డ్రైవర్ మృతి చెందాడు.
ఫ్రాన్స్ సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ట్రక్కు దూసుకుపోయిన ప్రాంతంలో కుప్పలుగా మృతదేహాలు పడి ఉన్నాయి. క్షతగాత్రులకు వైద్యసేవలు కొనసాగుతున్నాయి. ఉగ్రదాడిని ప్రపంచదేశాలు తీవ్రంగా ఖండిచాయి. మృతులకు ఒబామా సంతాపం తెలిపారు.