గిన్నిస్ రికార్డు కోసం.. కారు ఫీట్లు | A new Guinness world record, 40 people in car | Sakshi
Sakshi News home page

గిన్నిస్ రికార్డు కోసం.. కారు ఫీట్లు

Published Sun, May 17 2015 4:04 AM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM

గిన్నిస్ రికార్డు కోసం.. కారు ఫీట్లు - Sakshi

గిన్నిస్ రికార్డు కోసం.. కారు ఫీట్లు

అతడు సినిమా గుర్తుందా.. అందులో మహేశ్ బాబును కొట్టడానికి బ్రహ్మాజీ ఒకే సుమోలో 20, 30 మంది గూండాలను కుక్కేసి.. తీసుకెళ్తాడు. ఈ సీన్ కూడా దాదాపు అలాంటిదే. అయితే వీరంతా... కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టేందుకు చేస్తున్న ఫీట్లు ఇవి. కారులో సెంటీమీటర్ స్థలం కూడా లేకుండా, ఒకరి పక్కన మరొకరు, ఒకరి మీద మరొకరు స్థలంలో సర్దుకుంటూ వీలైనంత ఎక్కువ మంది దూరడమే అసలు రికార్డు. శనివారం రష్యాలోని క్రాస్నోయార్క్ నగరంలో సైబేరియన్ స్టేట్ టెక్నలాజికల్ యూనివర్సిటీ విద్యార్థులు ఇలా 40 మంది ఒకే కారులో దూరి కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement