32 పళ్లను పీకించేసుకున్నాడు!! | man obsessed with setting Guinness world records gets rid of teeth | Sakshi
Sakshi News home page

32 పళ్లను పీకించేసుకున్నాడు!!

Published Fri, May 27 2016 9:42 AM | Last Updated on Sun, Apr 7 2019 4:37 PM

గిన్సిస్ వరల్డ్ రికార్డు సృష్ఠించాలనే కలలతో ఓ వ్యక్తి ఒంటి నిండా 366 జెండాలను టాటూలను వేయించుకున్నాడు. అంతేకాదండోయ్ తన 32 పళ్లను పీకించేసుకున్నాడు.

న్యూఢిల్లీ: గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాలనే కోరికతో ఓ వ్యక్తి ఒంటి నిండా 366 జెండాలను టాటూలుగా వేయించుకున్నాడు. మరో రికార్డు కోసం  అతగాడు తన 32 పళ్లను పీకించేసుకున్నాడు. వాటి స్థానంలో 500ల స్ట్రాలను, 50 వెలిగించిన కొవ్వొత్తులను ఉంచుతానని చెబుతున్నాడు.  నగరానికి చెందిన హర్ ప్రకాశ్ రిషీ ఇప్పటికే దాదాపు 20 గిన్నీస్ రికార్డులను సృష్టించినట్లు చెప్పాడు.

తన పేరును గిన్నీస్ రిషీగా చెప్పుకుంటున్న ఇతను 1990లో ఇద్దరు స్నేహితులను ఎక్కించుకుని ఆపకుండా దాదాపు 1,001 గంటల పాటు వాహనం నడిపానని, అది తన మొదటి గిన్నిస్ రికార్డని తెలిపాడు. గతంలో 496 స్ట్రాలను నోట్లో పెట్టుకుని గిన్నిస్ రికార్డు సృష్టించినట్లు తెలిపాడు. అయితే ఎక్కువ సంఖ్యలో స్ట్రాలను అమర్చుకోవడానికే పళ్లను పీకేసుకున్నట్లు చెప్పుకొచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement