సెంచరీ పరుగువీరుడు | Century Sprinter | Sakshi
Sakshi News home page

సెంచరీ పరుగువీరుడు

Published Thu, Sep 24 2015 11:13 PM | Last Updated on Thu, Mar 28 2019 6:31 PM

సెంచరీ  పరుగువీరుడు - Sakshi

సెంచరీ పరుగువీరుడు

ఫొటో చూస్తే ఇదేమీ క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారం కాదని మీకు విషయం కాస్త అర్థమయ్యే ఉంటుంది. సెంచరీ... ఈ పెద్దాయన స్కోరు కాదు, ఆయన వయస్సు. ఇప్పటికింకా నా వయసు నిండా నూటైదే... అంటూ యువకుల కంటే ఉత్సాహంగా పరుగులు తీస్తున్న ఈ జపానీస్ పెద్దాయన పేరు హెదెకిచి మియాజకీ.

ఈయన సాధించిన ఘనత ఏమిటంటే, శరవేగంగా పరుగులు తీసే వయోధికుడిగా గిన్నెస్ రికార్డునే బద్దలు కొట్టాడు. జపాన్‌లోని క్యోటోలో 80 ఏళ్లకు పైబడ్డ వారికి నిర్వహించిన పరుగు పందెంలో పాల్గొన్నాడు. వందమీటర్ల దూరాన్ని సునాయాసంగా 42.22 సెకన్ల వ్యవధిలోనే దాటేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement