
విదేశాల్లో గోమూత్రంతో ‘క్యూ’ షాంపూ
తల నీళ్లోసుకోవాలనుకోగానే అందరికీ గుర్తొచ్చేది షాంపూయే.
ఐస్ లాండ్: తల నీళ్లోసుకోవాలనుకోగానే అందరికీ గుర్తొచ్చేది షాంపూయే. మన దేశంలో గోమూత్రంతో షాంపూ తయారు చేస్తారంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. కానీ విదేశాల్లోనూ ఇలా తయారైందంటే సంభ్రమాశ్చర్యాలకు గురికావాల్సిందే. ఆర్గానిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండటాన్ని గమనించిన యూనివర్సిటీ ఆఫ్ రేక్‌జావిక్ ఐస్‌లాండ్‌కు చెందిన ఆరుగురు ఔత్సాహిక విద్యార్థులు గోమూత్రంతో షాంపూ తయారుచేశారు.
విచిత్రం ఏంటంటే ప్రయోగాత్మకంగా వారే ఆ షాంపూతో తలకు పోసుకున్నారట. ఆ తర్వాత చూస్తే ఇంకేముందీ కేశాలు తళుక్కుమన్నాయట. దానికి 'క్యూ' షాంపూ అని నామకరణం చేశారు. ఇది గోమూత్రంతో తయారుచేసిన షాంపూ అయినందువల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు.