70 ఏళ్ల తర్వాత.. | After the age of 70 | Sakshi
Sakshi News home page

70 ఏళ్ల తర్వాత..

Published Wed, Apr 6 2016 2:51 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM

70 ఏళ్ల తర్వాత..

70 ఏళ్ల తర్వాత..

లండన్: రెండో ప్రపంచ యుద్ధం సమయంలో విడిపోయిన ఈ జంట ఇప్పుడు ఒక్కటవబోతోంది. ప్రియుడు రాయ్ వికర్‌మాన్  వయసు 90 ఏళ్లు కాగా ప్రియురాలు నోరా జాక్సన్‌కు 89 ఏళ్లు. యుద్ధం ముగిశాక  మానసిక కుంగుబాటుకు లోనై రాయ్ .. నోరా నుంచి విడిపోయాడు. బ్రిటన్‌లోని స్టోక్ ఆన్ ట్రెంటుకు చెందిన ఈ ఇద్దరు 1940లో ఒకరికొకరు పరిచయమయ్యారు. 1946లో వీరికి  నిశ్చితార్థం జరిగింది.

విడిపోయాక తన ప్రేయసి కోసం రాయ్ ఎంతో వెదికాడు. స్థానిక రేడియో స్టేషన్ సాయంతో ఆమె తన కు కేవలం రెండు మైళ్ల దూరంలోనే ఉందని గుర్తించాడు. తమ జీవిత భాగస్వాములు మృతి చెందడంతో తిరిగి ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇన్నాళ్ల తరువాత కలుసుకున్నాక రాయ్ తమ నిశ్చితార్థం నాటి ఉంగరంతోనే మళ్లీ ప్రపోజ్ చేయడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement