క్యాసినీ ‘ఆత్మహత్య’ ప్రయాణం షురూ!
ఖగోళ పరిశోధనల్లో రికార్డు సృష్టించిన వ్యోమనౌక క్యాసినీ ఆత్మహత్య (శాశ్వత విశ్రాంతి)కు రంగం సిద్ధమైంది. నాసా 1997 అక్టోబర్‌లో ప్రయోగించిన క్యాసినీ కోట్ల మైళ్ల దూరాన్ని అధిగమించి వెళ్లి.. పదేళ్లుగా శనిగ్రహం చుట్టూ చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో శనిగ్రహం తాలూకు ఎన్నో విశేషాలను మనకు అందించింది. దానికున్న ఉపగ్రహాల్లో ఏడింటిని గుర్తించింది కూడా. ఇకముందు ఆ గ్రహం చుట్టూ ఉండే వలయాల ద్వారా ప్రయాణిస్తూ.. వాటి విశేషాలను మనకు అందించనుంది. ఆ తరువాత కూలిపోనుంది. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను నాసా పూర్తి చేసింది. మొత్తంగా ఈ ఏడాది సెప్టెంబర్‌కల్లా క్యాసినీ తన సుదీర్ఘ ప్రయాణాన్ని చాలించనుంది.
క్యాసినీ రికార్డులు, అందించిన సమాచారం
24 లక్షలు:ఇప్పటివరకూ క్యాసినీ ఉపయోగించిన కంప్యూటర్ ఆదేశాలు
3,616: క్యాసినీ అందించిన వివరాల ఆధారంగా ప్రచురితమైన పరిశోధన వ్యాసాలు
220 కోట్ల మైళ్లు: శనిగ్రహం చుట్టూ క్యాసినీ తిరిగిన దూరం
599 గిగాబైట్లు: సేకరించిన సమాచారం
10: గుర్తించిన ఉపగ్రహాల సంఖ్య
27: నాసాతోపాటు ఈ ప్రాజెక్టులో భాగస్వాములైన దేశాలు
243: శనిగ్రహం చుట్టూ జరిపిన భ్రమణాలు
3,79,300:తీసిన ఫొటోల సంఖ్య
349:ఇంజిన్‌ను ఆన్/ఆఫ్ చేసిన సంఖ్య
– సాక్షి నాలెడ్జ్ సెంటర్