'ఆపిల్ వారికి సారీ చెప్పింది' | Apple Apologises to Teens Kicked Out of Store Over 'Theft Concerns' | Sakshi
Sakshi News home page

'ఆపిల్ వారికి సారీ చెప్పింది'

Published Thu, Nov 12 2015 12:26 PM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM

'ఆపిల్ వారికి సారీ చెప్పింది' - Sakshi

'ఆపిల్ వారికి సారీ చెప్పింది'

సిడ్నీ: తమ స్టోర్లోకి వచ్చిన ఆరుగురు ఆఫ్రికా విద్యార్థులను బయటకు గెంటేసిన ఘటనపై ఆపిల్ సంస్థ క్షమాపణలు చెప్పింది. తమ సిబ్బంది చేసిన పొరపాటుకు చింతిస్తున్నామని, ఈ విషయంలో క్షమించాలని కోరింది. గత మంగళవారం మెల్ బోర్న్ లోని మేరిబిర్నాంగ్ కాలేజీలో చదువుతున్న ఆఫ్రికా విద్యార్థుల్లో ఆరుగురు విద్యార్థులు అక్కడి ఐఫోన్ స్టోర్కు వెళ్లారు. అయితే, వారు దొంగతనానికి పాల్పడతారేమోనని అనుమానించి స్టోర్ సిబ్బంది వారిని బయటకు గెంటేసింది.

ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో రికార్డు చేసి 'సింపుల్ రేసిజం' అనే టైటిల్ తో ఫేస్ బుక్ లో పెట్టగా దానిని ఇప్పటికే 60,000మందికి పైగా చూశారు. అయితే, స్టోర్ యాజమాన్యం క్షమాపణలు చెప్పిన తర్వాత తిరిగి ఆ విద్యార్థులు బుధవారం షాపింగ్ కు వెళ్లారు. ఇలా ఒక్క ఐ ఫోన్ స్టోర్లే కాదు.. వారు ఎక్కడికి వెళ్లినా దాదాపుగా తమ ఆఫ్రికన్లపట్ల జాతివివక్ష చూపిస్తారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement