ఐసిస్ ఉగ్రవాదులకు అబు బకర్ అల్ బాగ్దాదీ పిలుపు
బాగ్దాద్: సౌదీ అరేబియా, టర్కీ దేశాలపై ఆత్మాహుతి దాడులు చేయాలంటూ ఐసిస్ ముష్కర మూకలకు ఐసిస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ పిలుపునిచ్చారు. రెండేళ్లనుంచి అజ్ఞాత ంలో ఉన్న అబూ బకర్ అల్ బాగ్దాదీని మోసుల్ పట్టణాన్ని ఇరాక్ సేనలు చుట్టుముట్టినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో...రెండేళ్ల తర్వాత ఐసిస్ ఉగ్రవాదులనుద్దేశించి పిలుపునివ్వడం ఇదే తొలిసారి. ఆడియో రూపంలో ఇచ్చిన సందేశంలో బాగ్దాదీ.. దేవునికి శత్రువులైన వారందరిపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐసిస్ ఉగ్రవాదులు ఆత్మాహుతి బాంబుదాడులతో విరుచుకుపడాలన్నారు. దేవుణ్ణి విశ్వసించని నగరాలను దాడులతో పూర్తిగా నేలమట్టం చేయాలన్నారు.
దేవునిపై విశ్వాసం లేని వారిని వారి మాతృభూమిని నాశనం చేసి అక్కడ రక్తపుటేరులు పారించాలని పిలుపునిచ్చారు. మోసుల్‌లో ఇరాక్ దళాలపై పోరులో వెనకడుగు వేయొద్దని..వారిపై విజయం సాధిస్తామన్నారు. వెనుదిరిగి పారిపోయే కంటే రణరంగంలో నిలవడమే తేలికని ఉగ్రమూకలను ఉద్దేశించి పిలుపునిచ్చారు. అయితే ఈ ఆడియో టేపు ఎప్పుడు విడుదలైందన్న విషయంపై సందిగ్ధత నెలకొంది.
సౌదీ, టర్కీలపై దాడులు చేయండి
Published Fri, Nov 4 2016 1:40 AM | Last Updated on Sat, Sep 15 2018 7:57 PM
Advertisement
Advertisement