నలుగురు జవాన్లు, ఒక ఉగ్రవాది మృతి
కరాచీ: పాకిస్థాన్‌లో తరచూ బాంబుదాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులు ఏకంగా ఆ దేశ ఆర్థిక రాజధాని అయిన కరాచీ పట్టణంలోని జిన్నా విమానాశ్రయంపైనే దాడికి తెగబడ్డారు. ఆదివారం రాత్రి భారీగా ఆయుధాలతో వచ్చిన ఐదు నుంచి ఎనిమిది మంది మిలిటెంట్లు కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని పాత టెర్మినల్ వద్ద హ్యాండ్ గ్రనేడ్ విసిరి దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో విమానాశ్రయ భద్రతా సిబ్బంది చనిపోగా, ఓ ఉగ్రవాదిని బలగాలు కాల్చిచంపాయి.
విమానాశ్రయంలోని పాత టెర్మినల్ వద్ద గల ఫోకర్ బిల్డింగ్‌లో నక్కిన ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు హోరాహోరి ఎదురుకాల్పులు జరుగుతున్నాయని స్థానిక మీడియా పేర్కొంది. విమానాశ్రయన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయని, సిబ్బందిని క్షేమంగా తరలిస్తున్నారని తెలిపింది.
జిన్నా విమానాశ్రయంపై ఉగ్రదాడి
Published Mon, Jun 9 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 8:30 AM
Advertisement