ఎన్కౌంటర్: ఐదుగురు తీవ్రవాదుల హతం | Five terrorists killed in Pakistan | Sakshi
Sakshi News home page

ఎన్కౌంటర్: ఐదుగురు తీవ్రవాదుల హతం

Published Tue, Jun 16 2015 11:03 AM | Last Updated on Sat, Aug 11 2018 8:07 PM

Five terrorists killed in Pakistan

ఇస్లామాబాద్: పాకిస్థాన్ సింధు, పంజాబ్ ప్రావెన్స్ల్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లలలో ఐదుగురు తీవ్రవాదులు హతమయ్యారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. కరాచీలోని న్యూ సబ్జీ మండి సమీపంలోని రహదారి వద్ద ఎన్కౌంటర్లో ఇద్దరు తీవ్రవాదులు... అలాగే పంజాబ్ ప్రావెన్స్లో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారని తెలిపారు.

ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాల నుంచి తీవ్రవాదులకు చెందిన ఆయుధాలు, మోటర్ బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. తీవ్రవాదులను అనుమానిస్తున్న దాదాప 40 మందిని కరాచీ నగరంలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక మీడియా జియో న్యూస్ వెల్లడించింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement