
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారితో ప్రపంచం దాదాపు 3 మిలియన్ల (30 లక్షల మంది) సోకింది. ప్రపంచవ్యాప్తంగా 205,000 మంది మరణించిన విపత్కర సమయంలో ప్రముఖ వ్యాపారవేత్త, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక ప్రకటన చేశారు. కరోనా వైరస్ పై పోరులో భాగంగా వ్యాక్సిన్ రూపకల్పనలో ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు వెల్లడించారు. అంతా సవ్యంగా జరిగితే ఏడాదిలోపే కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీని మొదలు పెట్టనున్నామని అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యులో తెలిపారు. లేదంటే దీనికి మందు కనుక్కోవడానికి రెండేళ్ళ లోపు సమయం పట్టవచ్చు అన్నారు. అయితే అంత సమయం పట్టక పోవచ్చుకానీ, వ్యాక్సిన్ ఉత్పత్తి సెప్టెంబరులో ప్రారంభం కాదని, ఇది తయారు కావడానికి కచ్చితంగా 18 నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం)
18 నెలలకంటే ఎక్కువ సమయం పట్టదని తాము అంచనా వేస్తున్నామని, అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్, వైట్ హౌస్ కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు ఆంథోనీ ఫౌసీని ఉటంకిస్తూ బిల్ గేట్స్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ అభివృద్ధి చేసేందుకు వందకు పైగా ప్రయత్నాలతో చాలా వేగంగా ముందు కెడుతున్నామనీ, ఈ విషయంలో చాలా ఆశాజనకంగా ఉన్నామన్నారు. వ్యాక్సిన్ అభివృధ్దితో పాటు, వేగంగా తయారీ ప్రక్రియపై కూడా దృష్టిపెట్టినట్టు చెప్పారు. (ప్రధానికి బిల్ గేట్స్ ప్రశంసలు)
మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు తగ్గించే నిర్ణయంపై గతంలో విమర్శలు గుప్పించిన బిల్ గేట్స్ తాజాగా అమెరికాలో ఎక్కువగా పరిక్షలు నిర్వహిస్తున్నామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై కూడా ప్రతికూలంగా స్పందించారు. తప్పుడు వ్యక్తులకు పరిక్షలు నిర్వహించారని ఆయన అన్నారు. 24 గంటల లోపు పరిక్షా ఫలితాలు రాకపోయినా సరే ఫలితం ఉండదని వ్యాఖ్యానించారు. అసలు ఆ పరిక్షలకు విలువ ఉండని ఆయన పేర్కొన్నారు. కాగా ప్రాణాంతక వైరస్ టీకా కోసం భారీ నిధులను సమకూరుస్తున్న బిలియనీర్ బిల్ గేట్స్ అత్యంత ఆశాజనకమైన ఏడు విధానాలకు నిధులు సమకూరుస్తుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment