క్షమాపణ కోరిన కెనడా ప్రధాని
ఒట్టావా: సిక్కులపట్ల అనుసరించిన వైఖరికిగాను 102 ఏళ్ల సుదీర్ఘ విరామనంతరం సోమవారం క్షమించమని కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడెవ్ కోరారు. ఒట్టావోలో జరిగిన బైసాఖి ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ.. ఆ రోజుల్లో ఉండే వివక్షపూరిత వలస చట్టాలే కారణమన్నారు. 376 మందిని సిక్కుల్ని వెనక్కి పంపగా.. దురదృష్టవశాత్తు కొమగటమారు షిప్‌లో 19 మందిని బ్రిటిష్ సైనికులు కాల్చి చంపారు.
సిక్కులకు క్షమాపణ చెబుతానని గతేడాది ఎన్నికల ప్రచారంలో జస్టిన్ ట్రుడెవ్ వాగ్దానం చేశారు. గతంలో కెనడా ప్రధానిగా పనిచేసిన స్టీఫెన్ హార్పర్ కూడా సిక్కులకు క్షమాపణ సంగతి తెలిసిందే.