ఒంటరి మహిళపై దాడి చేసి... | CCTV police appeal after violent robbery on woman in Newham | Sakshi
Sakshi News home page

ఒంటరి మహిళపై దాడి చేసి...

Published Fri, Mar 11 2016 7:23 PM | Last Updated on Tue, Aug 7 2018 4:29 PM

ఒంటరి మహిళపై దాడి చేసి... - Sakshi

ఒంటరి మహిళపై దాడి చేసి...

లండన్: మహిళపై కిరాతంగా దాడి చేసిన దొంగను పట్టుకునేందుకు లండన్ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా సీసీటీవీ ఫుటేజీని విడుదల చేశారు. దొంగను ఎవరైనా గుర్తిస్తే తమకు సమాచారం అందించాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ఫిబ్రవరి 20న నార్విచ్ రోడ్ లోని ఫారెస్ట్ గేట్ వద్ద జరిగిన ఈ దారి దోపిడీ స్థానికంగా సంచలనం రేపింది. నైట్ బస్సు దిగి ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న మహిళ(31)ను ఓ దుండగుడు ఆపాడు. ఏం చేస్తున్నావంటూ ఆమెను ప్రశ్నించాడు. పోలీసులకు సమాచారం అందించేందుకు ఆమె ప్రయత్నించగా తన చేతిలోని బాటిల్ తో దాడికి దిగాడు. ఆమె చేతిలోని సెల్ ఫోన్ లాక్కుని తల, చేతులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. బాధితురాలు కిందపడిపోవడంతో ఆమెను అక్కడే వదిలేసి సెల్ ఫోన్ తో పారిపోయాడు.

కొంతసేపటికి తేరుకున్న బాధితురాలు సమీపంలోని ఇంటికి వెళ్లి వారి సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. దుండగుడు నలుపు రంగులో ఉన్నాడని, బ్లాక్ జాకెట్, ముదరు రంగు ప్యాంట్ ధరించివున్నాడని బాధితురాలు తెలిపింది. అతడి చేతిలో రెడ్ వైన్ బాటిల్ ఉందని వెల్లడించింది. నిందితుడిని గుర్తిస్తే తమకు తెలపాలని స్థానికులను పోలీసులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement