ఫేస్‌బుక్ ట్రెండింగ్ ఫీచర్‌లో మార్పులు
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో వచ్చే నకిలీ వార్తలను అరికట్టేందుకు ఆ సంస్థ చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం ‘ట్రెండింగ్’ఫీచర్‌లో మార్పులు చేసింది. ఇక నుంచి కొద్ది మంది ప్రముఖ ప్రచురణకర్తలు అందించిన వార్తలు మాత్రమే ఫేస్‌బుక్ ట్రెండింగ్ జాబితాలో కనిపిస్తాయి. గతంలో ఎక్కువ మంది కామెంట్లు, షేర్లు చేస్తున్న పోస్ట్‌లను ఫేస్‌బుక్ ట్రెండింగ్‌గా గుర్తించేది.
ఫేస్‌బుక్‌లో వచ్చిన బూటకపు వార్తల వల్లే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ఓడిపోయి ట్రంప్ గెలిచాడని కూడా కొంతమంది విమర్శకులు అన్నారు. సమాచార సేకరణకు ఫేస్‌బుక్‌ను మరింత నమ్మకమైన సాధనంగా మార్చడానికి ఈ చర్య ఉపయోగపడుతుందని కంపెనీ ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ ఉపాధ్యక్షుడు తెలిపారు.