క్రిస్పర్‌తోఎన్నో వ్యాధులకు చెక్!
ఒక యాంటీబయోటిక్ మందుకు స్పందిస్తూ జీఎల్‌పీ1 హార్మోన్‌ను అధికంగా ఉత్పత్తి చేసేలా చేశారు. ఈ మార్పులన్నీ చేసిన జీఎల్‌పీ హార్మోన్‌ను చర్మ కణాల్లోకి చొప్పించి పరిశోధన శాలలో వాటిని పెంచారు. కొంతకాలం తరువాత ఈ కణాలకు గాలి సోకేలా చేసినప్పుడు.. అవి పలు పొరలున్న చర్మం లాంటి అవయవంగా మారింది. దీన్ని ఎలుకల చర్మానికి అతికించారు. ఈ ఎలుకలు యాంటీబయోటిక్ మందుతో కూడిన ఆహారాన్ని తిన్నప్పుడు వాటిల్లో జీఎల్‌పీ1 ఎక్కువగా ఉత్పత్తి అయింది.
ఫలితంగా రక్తంలో ఇన్సులిన్ శాతం పెరిగి మధుమేహ లక్షణాలు నెమ్మదించాయి. కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారం తిన్నప్పుడు కూడా జన్యుమార్పిడి చర్మమున్న ఎలుకలు పెద్దగా బరువు పెరగలేదు. సాధారణ ఎలుకలు బాగా లావెక్కాయి. జన్యుమార్పిడి తాలూకు ప్రయోజనాలు పొందేందుకు ఇదో వినూత్న పద్ధతని, భవిష్యత్తులో ఇది మధుమేహం, ఊబకాయంతోపాటు అనేక ఇతర వ్యాధుల చికిత్సకూ ఉపయోగపడే అవకాశముందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త షియాంగ్ వూ అంటున్నారు.