
బిల్ క్లింటన్ తాత కాబోతున్నాడు
మోనికా లూయిన్ స్కీతో వివాహేతర సంబంధం విషయంలో విశ్వవిఖ్యాతి పొందిన అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తాత కాబోతున్నారు. బిల్ క్లింటన్ కుమార్తె చెల్సియా క్లింటన్ త్వరలో తల్లి కాబోతోంది. భర్త మార్క్ తో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన చెల్సియా ఈ విషయం తెలియచేసింది.
చెల్సియా ప్రస్తుతం బిల్ క్లింటన్ ఫౌండేషన్ లో మహిళా సాధికారికతకి సంబంధించిన ప్రాజెక్టులో పనిచేస్తున్నారు. ఆమె ఈ సమావేశంలో మాట్లాడుతూ తాను గర్భవతి అన్న విషయాన్ని వెల్లడించింది. 'ఆడైనా, మగైనా నాకు ఒక్కటే. ఒక్క మాట మాత్రం నిజం. నాకు పుట్టే బిడ్డ శక్తివంతులైన మహిళా నేతల మధ్య ఎదుగుతుందని మాత్రం నేను చెప్పగలను,' అన్నారు చెల్సియా.