అమెరికాపై చైనా ఆగ్రహం | China Blames America On Iran Sanctions | Sakshi
Sakshi News home page

అమెరికాపై చైనా ఆగ్రహం

Published Mon, Jul 8 2019 10:23 PM | Last Updated on Mon, Jul 8 2019 10:25 PM

China Blames America On Iran Sanctions - Sakshi

అమెరికా జాతీయజెండాలను కాల్చుతున్న ఇరానీయులు

బీజింగ్‌: ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా చర్యలు ఏకపక్షంగా ఉన్నాయంటూ, ఈ చర్యలను అంతర్జాతీయ ఐక్యతకు పట్టిన క్యాన్సర్‌తో పోల్చింది. ఇరాన్‌ ఆంక్షలపై చైనా విదేశాంగ అధికార ప్రతినిధి జెంగ్‌ షాంగ్‌ అమెరికా తీరును తీవ్రంగా విమర్శించారు. 2015లో ఇరాన్‌తో కుదుర్చుకున్న న్యూక్లియర్‌ ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా తప్పుకోవడమేగాక కొత్త ఒప్పందం కుదుర్చుకోవాలని ఒత్తిడి చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఇందుకు ఒప్పుకోకపోవడంతో ఆంక్షలు విధించి ఇరాన్‌ను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. ఇరాన్‌తో బాధ్యాతాయుతమైన చర్చలు జరపాలని కోరారు. ఈ బెదిరింపులు ఇరాన్‌ను ఇంకా సంఘటితం చేస్తాయే తప్ప ఇరాన్‌ లొంగిపోవడం అసంభవం అన్నారు. ఇరాన్‌పై అమెరికా విధించే ఆంక్షలపై చైనా తీవ్రంగా స్పందించడం ఇదే తొలిసారి.

అమెరికా గత కొంతకాలంగా ఇరాన్‌పై ఆంక్షలు కఠినంగా అమలు చేయడంతో ఇరాన్‌ చమురు ఎగుమతులు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. దీంతో ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయింది. అయినా ఆంక్షలకు భయపడని ఇరాన్‌, యురేనియం నిల్వలను 5 శాతం నుంచి 20 శాతానికి పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. 2015లో ఒప్పందంపై సంతకాలు చేసిన యూరోపియన్‌ దేశాలు జోక్యం చేసుకోవాలని కోరినా సరైన స్పందన లేకపోవడంతో అమెరికాతో తలపడాలనే ఇరాన్‌ నిర్ణయం తీసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement