అమెరికా-చైనా మధ‍్య రగులుతున్న ట్రేడ్‌వార్ దెబ్బడ్రాగెన్ కంట్రీపై గట్టిగానే పడింది. 2018లో మందగిస్తూ వచ్చిన చైనా ఆర్థిక వృద్ధి రేటు మరింత పతనమైంది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి చైనా 6.6 శాతం వృద్ధి రేటు సాధించింది. పెట్టుబడులు బలహీనపడటం, అమెరికాతో వాణిజ్య యుద్ధం చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడంతో చైనా జీడీపీ 28 ఏళ్ల కనిష్ఠాన్ని తాకింది. గతేడాది నాల్గవ త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు కేవలం 6.4 శాతంగా ఉంది. గత త్రైమాసికంలో నమోదు చేసిన 6.5శాతం వృద్ధి రేటు కంటే ఇది తక్కువ. 2018లో చైనా వృద్ధిరేటు 6.6 శాతంగా ఉన్నట్లు చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. 1990 తరువాత ఇదే అతి తక్కువ. దీంతో అగ్రరాజ్యం అమెరికాతో నువ్వా నేనా అంటూ పోటీపడుతున్న చైనా ఇప్పుడు ఆర్థిక కష్టాల్లో పడింది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు మరింత పతనాన్ని నమోదు చేయనుందని అంచనా వేశారు. అమెరికాతో వాణిజ్య యుద్ధం, అధిక రుణ భారం లాంటి సమస్యలే చైనా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడానికి ముఖ్య కారణాలుగా చెబుతున్నారు. గత ఏడాది చైనా వస్తువుల దిగుమతులపై దాదాపు 250 బిలియన్ డాలర్ల విలువైన సుంకం విధింపు చైనా ఎగుమతులపై ప్రభావం పడింది. ఆ పరిణామాల తర్వాత బీజింగ్ తన ఆర్థిక ఫలితాలు విడుదల చేయడం ఇదే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment