
భారత్‌కు వెళ్తున్నారా జాగ్రత్త
భారత్‌కు వెళ్లే తమ పౌరులకు చైనా భద్రతా సూచన
బీజింగ్: సిక్కిం సరిహద్దు వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్‌కు పయనమవుతున్న తమ దేశ పౌరులకు చైనా సలహాలతో కూడిన హెచ్చరికలు జారీ చేసింది. భారత్‌కు వెళ్లే వారు స్వీయ భద్రతపై పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ‘చైనా ప్రయాణికులకు ఇది హెచ్చ రిక కాదు (ట్రావెల్ అలర్ట్). జాగ్రత్తగా ఉండాలని మాత్రం చెబుతున్నాం’అని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది.
శనివారం తేదీతో, చైనా భాషలో ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది.చైనా ప్రయాణికులు భారత్‌లో స్థానిక భద్రత విషయంలో స్వీయ రక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనవస రమైన ప్రయాణాలు తగ్గించుకోవాలని, తమ వస్తువుల భద్రతపై జాగ్రత్తగా ఉండాలని, ఎప్పటి కప్పుడు తమ వివరాలను కుటుంబ సభ్యులకు అందజేస్తూ ఉండాలని సూచించింది.
గుర్తింపు కార్డులను ఎప్పుడూ వెంట తీసుకెళ్లాలని, భారతీయ చట్టాలకు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పేర్కొంది. ఏదైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే సంప్రదించాల్సిందిగా చైనా రాయబార కార్యాల యం ఫోన్ నంబర్లను కూడా అందులో పేర్కొంది. సిక్కిం వద్ద భారత్, చైనా మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత్‌కు వెళ్లే తమ ప్రయా ణికులకు భద్రతపై ‘ట్రావెల్ అలర్ట్’ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చైనా జూలై 5న పేర్కొంది. చైనా పెట్టుబడిదారులు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించింది.