
ఇస్లామాబాద్ : దాయాది దేశం పాకిస్తాన్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో పాక్‌లో కొత్తగా 4,960 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ దేశ జాతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తం 98,943 కరోనా కేసులు నమోదైనట్లు పాకిస్థాన్ ప్రభుత్వం పేర్కొంది. కరోనాతో ఆదివారం ఒక్కరోజే 67 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా మృతుల కేసుల సంఖ్య 2,002 చేరింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70 లక్షల 26 వేలకు చేరగా.. 34 లక్షల మందికిపైగా కోలుకున్నారు.
(చదవండి : 20 లక్షల వ్యాక్సిన్ డోస్‌లు రెడీ)