కరాచీ: ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. తొలుత భారత్‌లో నమోదైన కేసుల సంఖ్య లాక్‌డౌన్ సడలింపులతో విపరీతంగా పెరిగిపోయింది. అటు పొరుగు దేశమైన పాకిస్తాన్ కరోనాను ఎదుర్కోలేక పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థతో కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలో అక్కడ ఓ రాజకీయ నాయకుడు వైరస్‌పై విచిత్ర వ్యాఖ్యలు చేశారు. "నువ్వు ఎంతసేపు పడుకుంటే కరోనా అంతసేపు నిద్రిస్తుంది. మనం చనిపోతే కరోనా చనిపోతుంది. అంతే.. " (పాకిస్తాన్ మాజీ ప్రధానికి కరోనా పాజిటివ్)
"నిద్రించే సమయంలో వైరస్ ఎలాంటి హాని చేయదు. పైగా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ఎక్కువ గంటలు నిద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు" అంటూ పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సభ్యుడు ఫజల్ ఉర్ రెహ్మాన్ పేర్కొన్నారు.. ఈ వీడియోను పాక్ జర్నలిస్టు నైలా ఇనాయత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. "అవును, ఈ మాటలు వింటే కరోనా నిజంగానే చనిపోతుంది" అంటూ కామెంట్లు చేస్తున్నారు. "ఇంతకీ పరిష్కారం ఏంటంటారు? ఇప్పుడు మనం నిద్రపోవాలా? చచ్చిపోవాలా?" అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. (రూ. 75 వేలకు ఆర్మీ సమాచారం అమ్మేశారు!)
Comments
Please login to add a commentAdd a comment