పిల్ల రాక్షసుడు ఎంత సాహసం చేశాడు
లండన్: సాధారణంగా ఏ తల్లిదండ్రులైన తమ పిల్లలను వెనుక సీట్లోనో లేదంటే పక్క సీట్లోనో కూర్చొబెట్టుకొని డ్రైవింగ్ చేస్తుంటారు. స్కూల్కి వారే తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకొస్తుంటారు. ఒక యుక్త వయసు వచ్చే వరకు వారికి వాహనం నడపడంలాంటి బాధ్యతలు అప్పగించరు. కానీ, బ్రిటన్లోని వెస్ట్ సస్సెక్స్ లో మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది.
ఓ తండ్రి వెనుకాలే ఓ ట్రాలీలాంటి దాంట్లో కూర్చోగా ఆ ట్రాలీని తన ఎలక్ట్రిక్ కారుకు కట్టుకొని ఓ పిల్ల రాక్షసుడు రద్దీ రోడ్డు దాటుతూ పాదచారుల ఎక్కువగా ఉండే వీధుల్లో తన కారును వేగంగా పోనిస్తూ ఏం చక్కా చక్కర్లు కొట్టారు. అలా సిటీ వీధుల్లో తిరుగుతూ అనంతరం తండ్రితో కలసి ఏం చక్కా ఇంటికి వెళ్లాడు. ఓ వ్యక్తి కెమెరాకు చిక్కిన వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది.