వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సముద్రంలో తమ ఓడలకు అడ్డుతగిలతే ఇరాన్ నౌకలను ధ్వంసం చేయాలని ఆదేశాలిచ్చారు. ‘మా ఓడలకు అడ్డంకులు సృష్టిస్తే ఇరాన్ గన్‌బోట్లను కాల్చిపారేసి ధ్వంసం చేసేయ్యాలని అమెరికా నావికా దళానికి ఆదేశాలు ఇచ్చాన’ని ట్రంప్ ట్వీట్ చేశారు. ఉత్తర అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో రాకపోకలు సాగిస్తున్న అమెరికా నావికాదళ నౌకలపై దాడులు చేసేందుకు ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్(ఐఆర్‌జీసీ) ప్రయత్నిస్తోందన్న వార్తల నేప్యథంలో ట్రంప్ తాజా హెచ్చరికలు జారీ చేశారు.
‘ఉత్తర అరేబియా సముద్రంలో ఐఆర్‌జీసీకి చెందిన 11 నౌకలు పదేపదే అమెరికా ఓడలకు అడ్డుతగులుతూ ప్రమాదకరంగా సంచరిస్తున్నాయి. ఓడలు పరస్పరం ఢీకొట్టుకోకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపడతామ’ని హెచ్చరిస్తూ అమెరికా నేవీ ఈనెల 16న ట్వీట్ చేసింది. అయితే అమెరికా ఆరోపణలను ఇరాన్ తోసిపుచ్చింది. అసత్య సమాచారంతో తమకు వ్యతిరేకంగా హాలీవుడ్ కథలు చెబుతోందని అమెరికాపై మండిపడింది.
Comments
Please login to add a commentAdd a comment