భోజనానికి ముందు రెండు గ్లాసుల నీళ్లు! | Drink Water Before Meals to Lose Weight? | Sakshi
Sakshi News home page

భోజనానికి ముందు రెండు గ్లాసుల నీళ్లు!

Published Tue, Oct 11 2016 1:57 AM | Last Updated on Sat, Aug 25 2018 5:38 PM

భోజనానికి ముందు రెండు గ్లాసుల నీళ్లు! - Sakshi

భోజనానికి ముందు రెండు గ్లాసుల నీళ్లు!

భోజనానికి ముందు రెండు గ్లాసుల నీరు తాగడం ద్వారా బరువు తగ్గవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

లండన్: భోజనానికి ముందు రెండు గ్లాసుల నీరు తాగడం ద్వారా బరువు తగ్గవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. భోజనానికి ముందే నీరు తాగడంతో కడుపు నిండిన అనుభూతి పొందుతారని, ఆహారం తక్కువగా తింటారని తద్వారా బరువు తగ్గుతారని తేలింది. ఈ మేరకు బర్మింగ్‌హామ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ప్రాథమిక ఆధారాలతో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇలా భోజనానికి ముందు నీరు తాగేవారు మూడు నెలల్లోనే 4 కిలోల బరువు తగ్గుతారని  ఈ అధ్యయనంలో తేలినట్లు లండన్‌కి చెందిన ‘ఒబెసిటి’ జర్నల్ ప్రచురించింది.

దీని ద్వారా ఎలాంటి వ్యయ ప్రయాసలు లేకుండా బరువు తగ్గవచ్చని పరిశోధకులు అంటున్నారు. కాగా, ప్రస్తుతం 5-17 ఏళ్ల వయస్సున్న 268 మిలియన్ల పిల్లలు 2025 వరకు అధిక బరువుతో బాధపడే అవకాశం ఉందని వరల్డ్ ఒబెసిటి ఫెడరేషన్ హెచ్చరించింది. వీరిలో 98 మిలియన్ల మంది స్థూలకాయం బారిన పడే అవకాశముందని తెలిపింది. అయితే 2014లో ప్రపంచవ్యాప్తంగా 18 ఏళ్ల పైబడిన వారిలో 1.9 బిలియన్ల మంది అధిక బరువు కలిగి ఉన్నారని, వీరిలో 600 మిలియన్ల మంది స్థూలకాయులున్నారని వెల్లడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement