పొరపడిన పైలట్
సముద్రంపై దించబోయి..
టోక్యో: ఓ పైలట్ పొరపాటుగా విమానాన్ని సముద్రంపై దించబోయాడు. చివరి క్షణంలో తప్పును గ్రహించడంతో ప్రమాదం తప్పింది. పైలట్ చర్య ప్రయాణికులను, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లను కంగారు పెట్టించింది. జపాన్‌లోని ఇషిగాకి ఐలాండ్ నుంచి 59 మందితో సోమవారం నాహాకు బయల్దేరిన విమానం... గమ్యస్థానానికి చేరువైంది. ఇంతలో ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోలర్ల నుంచి సూచనలు అందాయి.
వాటిని పైలట్ పొరపాటుగా అర్థం చేసుకున్నాడు. దాంతో విమానాశ్రయం రాకముందే... సముద్రంపైనే దించబోయాడు. విమానం 75 మీటర్ల ఎత్తు వరకు కిందికి వచ్చేసింది. చివరికి గ్రౌండ్ ప్రాక్సిమిటీ నుంచి హెచ్చరికలు రావడంతో పైలట్ విమానాన్ని పైకి మళ్లించి... విమానాశ్రయంలో సురక్షితంగా దింపాడు.