లాస్ ఏంజిల్స్: యూఎస్లో ఓ యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. కాలిఫోర్నియా వెంట్యురా కౌంటీ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. విమానం కుప్ప కూలిన వెంటనే మంటలు భారీగా ఎగసిపడ్డాయని... అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చిందన్నారు.
సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ఘటనపై నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డు విచారణ జరుపుతుందని చెప్పారు. ఈ ప్రమాదం బుధవారం సాయంత్రం చోటు చేసుకుందని ఉన్నతాధికారులు వెల్లడించారు.