![ఆస్తమాకు సరికొత్త ఔషధం](/styles/webp/s3/article_images/2017/09/4/41470513130_625x300.jpg.webp?itok=kU1KII1N)
ఆస్తమాకు సరికొత్త ఔషధం
లండన్: ఆస్తమా బాధితులకు ఒక తీపి కబురు.. 20 ఏళ్ల తరువాత తొలిసారిగా ఉబ్బసం తీవ్రతను గణనీయంగా తగ్గించే సరికొత్త ట్యాబ్లెట్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచారు. ఈ ట్యాబ్లెట్ ఉబ్బసం లక్షణాలను తగ్గించి ఊపిరితిత్తుల పనితీరును మెరుగు పరుస్తుందని, ఊపిరితిత్తుల్లో మంటను తగ్గించి, వాయు నాళాలను శుభ్రం చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. రానున్న రోజుల్లో ఉబ్బసం చికిత్సలో ఈ ఔషధం కొత్త ఒరవడిని సృష్టించనుందని యూకే లోని యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ కు చెందిన పరిశోధకుడు క్రిస్టోఫర్ బ్రైట్లింగ్ అన్నారు. ప్రస్తుతం ఈ ఔషధం క్లినికల్ ట్రయల్స్ ఆఖరి దశలో ఉంది.