లూయీస్ జాక్వేస్ మాండే డాగ్వేర్ ఈ ఫొటో తీశారు. 1838లో పారిస్‌లోని బౌలేవార్డ్ డ్యు టెంపుల్ స్ట్రీట్‌లో తీశారు. దూరం నుంచి తీయడం వల్ల మసకగా కనిపిస్తున్నా.. బాగా గమనిస్తే.. ఓ వ్యక్తి తన బూట్లను పాలిష్ చేయించుకుంటున్న దృశ్యం ఫొటో కింద ఎడమవైపు కనిపిస్తుంది.
ఫొటో.. మాటలకందని ఓ దృశ్య కావ్యం.. ప్రేమగా లాలిస్తుంది.. హాయిగా నవ్విస్తుంది.. కోపంగా కసురుకుంటుంది.. కంటతడి కూడా పెట్టిస్తుంది..
ఫ్రాన్స్‌కు చెందిన లూయీస్ జాక్వేస్ మాండే డాగ్వేర్ 1837లోనే తొలిసారి డాగ్వేరియన్ ఫొటోగ్రఫీ విధానానికి రూపకల్పన చేశారు. రెండేళ్ల తర్వాత 1839 జనవరి 9న ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఈ విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. వందేళ్ల తర్వాత ఆగస్టు 19న ఫ్రాన్స్ ప్రభుత్వం డాగ్వేర్ ఫొటోగ్రఫీ పేటెంట్లను కొనుగోలు చేసింది. ప్రజలందరికీ ఈ విధానం ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు గుర్తుగా 2010 నుంచి ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. అప్పట్లో ఫొటోలు తీసేందుకు రాగి, వేడిని ఉపయోగించేవారు.
Comments
Please login to add a commentAdd a comment