జీపీఎస్ టెక్నాలజీ సూట్‌కేసులు వచ్చేస్తున్నాయ్
కాలిఫోర్నియా : మనం సాధారణంగా మొబైల్స్, కార్లలో జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) టెక్నాలజీని ఎక్కువగా వాడుతుంటాం. కానీ ఒక సూట్‌కేస్‌కి జీపీఎస్ ఉంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? మన సామాన్లు భద్రంగా ఉండటమే కాదు.. అది ప్రపంచంలో ఎక్కడున్నా లొకేషన్‌ను ట్రేస్‌చేసి తెలుసుకోవచ్చు. అదే బ్లూస్మార్ట్ సూట్‌కే సు. ఇది మొబైల్ యాప్ ద్వారా పనిచేస్తుంది.
ఇందులో ఓ పవర్‌బ్యాంక్ కూడా ఉంటుంది. దీనిద్వారా మొబైల్ చార్జింగ్ చేసుకోవచ్చు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ సూట్‌కేసుకు డిజిటల్ లాక్ కూడా ఉంది. దానిని పగలగొడితే తప్ప దొంగలు ఓపెన్ చేయలేరు. త్వరలోనే ఇండియాలో ఈ బ్లూస్మార్ట్ సూట్‌కేసులు మార్కెట్‌లోకి అందుబాటులోకి రానున్నాయి.