ఈ వర్శిటీల పూర్వ విద్యార్థులే నేడు బిలియనీర్లు | How many billionaire alumni does Harvard have? | Sakshi
Sakshi News home page

ఈ వర్శిటీల పూర్వ విద్యార్థులే నేడు బిలియనీర్లు

Published Sat, Aug 6 2016 4:24 PM | Last Updated on Thu, Oct 4 2018 4:43 PM

ఈ వర్శిటీల పూర్వ విద్యార్థులే నేడు బిలియనీర్లు - Sakshi

ఈ వర్శిటీల పూర్వ విద్యార్థులే నేడు బిలియనీర్లు

న్యూయార్క్: అమెరికాలో ‘ఫోర్బ్స్’ మాగజైన్ ఎంపిక చేసిన 400 మంది టాప్ బిలియనీర్లలో ఎవరు ఏ యూనివర్శిటీ పూర్వ విద్యార్థులు, ఎవరు ఏ కాలేజీ నుంచి డిగ్రీ పట్టాలను పొందారన్న విషయాన్ని విశ్లేషించగా పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికాలో 660 యూనివర్శిటీ కాలేజీలు ఉండగా, వాటిలో కేవలం 28 కాలీజీల నుంచి డిగ్రీ పట్టాలు పొందిన వాళ్లు ఈ 400 మంది బిలియనీర్లలో ఉన్నారు. హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుకున్న వారే ఎక్కువ మంది బిలియనీర్లు ఉంటారన్నది ఒక అభిప్రాయం. ఇప్పుడు ఆ అభిప్రాయం తప్పదని, అది అపోహ మాత్రమేనని ఫోర్బ్స్ విశ్లేషణలో తేలింది.

400 మంది బిలియనీర్లలో అత్యధికంగా 21 మంది (మొత్తంలో ఐదు శాతం) పెన్సిల్వేనియాలో చదువుకున్నవారే కావడం విశేషం. రెండో స్థానంలో హార్వర్డ్ యూనివర్శిటీ, యేలే యూనివర్శిటీలు ఉన్నాయి. బిలియనీర్లలో ఈ రెండు యూనివర్శిటీల నుంచి డిగ్రీ పట్టాలు పొందిన వారు 14 మంది చొప్పున ఉన్నారు. ఈ బిలియనీర్లలో అమెరికా ప్రైవేటు యూనివర్శిటీ కాలేజీలోనే కాకుండా ప్రభుత్వ కాలేజీల్లో చదువుకున్న వాళ్లు, చదువును అర్ధాంతరంగా ఆపేసిన వాళ్లు ఉన్నారు. అమెరికా వెలుపల, అంటే ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’లో చదువుకున్న వారు కూడా ఉన్నారు.

‘పే పాల్’ సహ వ్యవస్థాపకుడు, టెస్లా మోటార్స్, స్పేస్ ఎక్స్ సంస్థల ప్రస్తుత సీఈవో ఎలాన్ మాస్క్ పెన్సిల్వేనియా యూనివర్శిటీలో ‘గ్రాడ్యువేట్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’లో చదువున్నారు. ఆయన కెనడాలోని క్వీన్స్ యూనివర్శిటీ నుంచి ఈ యూనివర్శిటీకి బదిలీపై వచ్చారు. పెన్సిల్వేనియా యూనివర్శిటీలో ఎకనామిక్స్, ఫిజిక్స్‌లలో డిగ్రీ పట్టాలు పొందిన ఆయన తన స్టార్టప్ కంపెనీ కోసం పీహెడ్‌డీని మధ్యలో వదిలేశారు. స్టీవ్ జాబ్స్ వితంతు భార్య లారెన్ పావెల్ జాబ్స్, కాసినో మ్యాగ్నెట్ స్టీవ్ వ్యాన్‌లు కూడా పెన్సిల్వేనియా యూనివ ర్శిటీలోనే చదువుకున్నారు. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియా యూనివర్శిటీ నుంచి ఎకనామిక్స్‌లో డిగ్రీ పట్టా పొందారు, ఆయన కుమారుడు, కుమార్తె కూడా కొంతకాలం ఇదే యూనివర్శిటీలో చదువుకున్నారు.

అమెరికాలో యంగెస్ట్ బిలియనీర్, ఎయిర్‌బన్బ్ సహ వ్యవస్థాపకుడు నాథన్ బెచార్క్‌జిక్ (32) హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రి చదివారు. లాస్ ఏంజెలిస్ క్లిప్పర్స్ యజమాని, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బాల్మర్, ఆయిల్ టైకూన్ జాన్ డీ రాక్‌ఫెల్లర్ మనవడు డేవిడ్ రాక్‌ఫెల్లర్ హార్వర్డ్ యూనివర్శిటీ గ్రాడ్యువేట్లే. డ్రాపవుట్లకు కూడా ఈ యూనివర్శిటీ ఫేమే.

ఫేస్‌బుక్ చీఫ్ జుకర్ బర్గ్, ప్రపంచ సంపన్నుడు బిల్ గేట్స్ అర్దంతరంగా ఇక్కడ చదువుకు స్వస్తి చెప్పిన వాళ్లే. బ్లాక్‌స్టోన్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు స్టీఫెన్ స్క్వార్జ్‌మన్ హార్వర్డ్ యూనివర్శిటీలో చేరుదామనుకొని అడ్మిషన్ లభించక పోవడంతో యేలే యూనివర్శిటీలో డిగ్రీ చదివారు. ఆ తర్వాత ‘హార్వర్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్’లో ఎంబీయే చేశారు. ఫెడెక్స్ వ్యవస్థాపకుడు ఫ్రెడ్ స్మిత్, మార్స్ క్యాండీ కంపెనీ కుటుంబ సభ్యులు జాన్, ఫారెస్ట్ మార్స్ యేలే యూనివర్శిటీలోనే డిగ్రీ చేశారు.

బిలియనీర్లను ఇచ్చిన యూనివర్శిటీల్లో స్టాన్‌ఫర్డ్ నాలుగవ స్థానంలో ఉంది. 400 మంది బిలియనీర్లలో 13 మంది బిలియనీర్లు ఈ యూనివర్శిటీలో చదువుకున్న వారే. వీరిలో ఎక్కువ మంది టెక్ బిలియనీర్లు ఉన్నారు. స్నాప్‌చాట్ వ్యవస్థాపకులు ఎవాన్ స్పీగల్, బాబీ మర్ఫీ, వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు బ్రియాన్ ఆక్టన్, లింక్డ్‌ఇన్‌కు చెందిన రీడ్ హాఫ్‌మన్ స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో డిగ్రీలు చేసిన వారే.

టాప్ యూనివర్శిటీలో చదువుకున్న వారే బిలియనీర్లు అవుతారనుకుంటే పొరపాటే. టాప్ 400 మంది బిలియనీర్లలో 108 మంది డిగ్రీలు చదవనివారే. వారిలో 28 మంది హైస్కూల్ విద్య కూడా పూర్తి చేయలేదు. డోల్ ఫుడ్స్ సీఈవో డేవిడ్ ముర్డోక్ తొమ్మిదవ తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పారు. ఆయనకు ఒకప్పుడు ఇల్లు వాకిలి కూడా లేదు. పార్కుల్లో పడుకునే వాడు. కొద్దికాలం పెట్రోల్ బంకులో కూడా పనిచేశారు. 1200 డాలర్ల రుణంతో రోడ్డు పక్కన తినుబండారాల విక్రయాలను మొదలుపెట్టి ఇప్పుడు శతకోటీశ్వరుడయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement