ఊతకర్రల యంత్రుడు! | Humanoid robot | Sakshi
Sakshi News home page

ఊతకర్రల యంత్రుడు!

Published Mon, Jul 14 2014 12:21 AM | Last Updated on Sat, Sep 2 2017 10:15 AM

ఊతకర్రల యంత్రుడు!

ఊతకర్రల యంత్రుడు!

మనిషి మాదిరిగా ఊతకర్రలను ఉపయోగించుకుంటూ భవనాల శిథిలాలు, కొండలు కోనలు, ఎగుడుదిగుళ్లలో సునాయాసంగా తిరగగలిగే వినూత్న హ్యూమనాయిడ్ రోబోను స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందిస్తున్నారు. సెన్సర్లు, కెమెరాలతో కూడిన హైటెక్ ఊతకర్రల సాయంతో ఈ రోబోలు సహాయక చర్యల్లో బాగా పాల్గొంటాయని చెబుతున్నారు.

ఊతకర్రలతో పరిసరాలను అర్థం చేసుకుంటూ తలలోని కెమెరాలు, సెన్సర్లతో సైతం పరిస్థితులను గమనిస్తూ ఇవి భవనాలు కూలినప్పుడు లేదా ఇతర విపత్తుల సమయాల్లో సమర్థంగా సేవలందిస్తాయని అంటున్నారు. అవసరమైనప్పుడు ఈ రోబో తన ఊతకర్రల పొడవును తగ్గించుకుని లేదా పెంచుకుని కూడా పనిచేస్తుందట. ఒకరకంగా ఊతకర్రలు దీనికి మరో రెండు కాళ్లలా ఉపయోగపడతాయట.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement