నాకు అవార్డు వచ్చింది.. లైక్స్ కొట్టండోయ్.. | I got the award .. .. Likes | Sakshi
Sakshi News home page

నాకు అవార్డు వచ్చింది.. లైక్స్ కొట్టండోయ్..

Published Thu, Oct 23 2014 1:22 AM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

నాకు అవార్డు వచ్చింది.. లైక్స్ కొట్టండోయ్.. - Sakshi

నాకు అవార్డు వచ్చింది.. లైక్స్ కొట్టండోయ్..

సీరియస్‌గా ఫేస్‌బుక్‌లో స్టేటస్ అప్‌డేట్ చేస్తున్నట్లు కనిపిస్తున్న ఈ కోతి చిత్రం ఇప్పటికే ఎందరినో ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్నీ గెలుచుకుంది. నేచురల్ హిస్టరీ మ్యూజియం, బీబీసీ వారు కలిసి నిర్వహించిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్-2014లో పీపుల్స్ చాయిస్ అవార్డును ఇది సొంతం చేసుకుంది.

ప్రజల నుంచి వచ్చిన ఓట్ల ఆధారంగా దీన్ని ఎంపిక చేశారు. ఈ చిత్రాన్ని నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ మార్సెల్ ఊస్టన్ తీశారు. జపాన్‌లోని జిగోకుడానీ కోతుల పార్క్‌లో ఓ పర్యాటకుడు  కోతికి దగ్గరగా వెళ్లి ఫొటో తీయడానికి ప్రయత్నించినప్పుడు ఆ వానరం అతడి చేతిలోని ఫోన్ ఎత్తికెళ్లిపోయిందని.. దాంతో అది ఆడుకుంటున్నప్పుడు తీసినదే ఈ చిత్రమని మార్సెల్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement