భారత్‌కు 141వ స్థానం
లండన్: విశ్వ శాంతి సూచికలో (గ్లోబల్ పీస్ ఇండెక్స్)లో భారత్ చివరి వరుసలో నిలిచింది. ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ (ఐఈపీ) అనే అంతర్జాతీయ సంస్థ అత్యంత శాంతియుత ప్రాంతాలేవనే దానిపై 163 దేశాలపై సర్వే చేసింది. ఇందులో భారత్‌కు 141వ స్థానం దక్కింది. సిరియా చిట్టచివరి స్థానం సాధించగా.. అంతకు ముందు స్థానాల్లో వరుసగా దక్షిణ సుడాన్, ఇరాక్, అఫ్గానిస్తాన్, సోమాలియాలు నిలిచాయి. ఐస్‌ల్యాండ్ మొదటి ర్యాంకు సాధించగా డెన్మార్క్, ఆస్ట్రియా వరుసగా 2,3 స్థానాల్లో నిలిచాయి.
కిందటేడాదితో పోలిస్తే భారత్ 2ర్యాంకులు మెరుగుపరుచుకుంది. దశాబ్దంగా భారత్‌లో శాంతియుత పరిస్థితులు క్షీణిస్తూ వస్తున్నాయని ఆ అధ్యయనం వెల్లడించింది. పాకిస్తాన్ సరిహద్దు వద్ద ఉద్రిక్తత వల్ల భారత్‌లో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందని.. కాగా, శ్రీలంక పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెరపి దేశంలో స్థానాన్ని మెరుగుపరుచుకుందని పేర్కొంది.
శాంతి సూచీలో అట్టడుగున
Published Thu, Jun 9 2016 2:31 AM | Last Updated on Mon, Sep 4 2017 2:00 AM
Advertisement