‘అది విఫల ప్రయోగం’ | India-US nuke deal signed without ground work  | Sakshi
Sakshi News home page

‘అది విఫల ప్రయోగం’

Published Thu, Oct 26 2017 1:12 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

India-US nuke deal signed without ground work  - Sakshi

వాషింగ్టన్‌: భారత్‌-అమెరికాల మధ్య పౌర అణు ఒప్పందం ఓ ఘోర వైఫల్యమని అమెరికా మాజీ సెనేటర్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఎలాంటి ముందస్తు కసరత్తు లేకుండానే ఈ ఒప్పందం తెరపైకి తెచ్చారని ఆక్షేపించారు. అమెరికా డిఫెన్స్‌ తయారీ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చే ఆయుధ ఒప్పందంలా దీన్ని మార్చారని మాజీ రిపబ్లికన్‌ సెనేటర్‌ లారీ ప్రెస్లర్‌ అన్నారు. ప్రెస్లర్‌ గతంలో యూఎస్‌ సేనేట్‌ ఆయుధ నియంత్రణ సబ్‌కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించారు.

అమెరికా-భారత్‌ అణుఒప్పందాన్ని మైలురాయిగా అభివర్ణిస్తున్నప్పటికీ అది విఫల ప్రయోగమేనని, ఎలాంటి గ్రౌండ్‌ వర్క్‌ చేపట్టకుండానే ఒప్పందంపై సంతకాలు చేశారని ప్రెస్లర్‌ పెదవివిరిచారు. ఈ ఒప్పందానికి ఆదిలోనే తూట్లు పడ్డాయని అన్నారు.ఒప్పందంలో ఒనగూరే అంశాలేమీ లేవు..ఇది కేవలం ఆయుధ విక్రయ ఒప్పందం మాత్రమేనని నిశితంగా పరిశీలిస్తే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. అక్టోబర్‌ 2008లో ఈ ఒప్పందంపై సంతకాలు జరగ్గా అప్పటి అమెరికా అధ్యోక్షుడు బరాక్‌ ఒబామా బారత్‌ పర్యటన కేవలం ఆయుధ విక్రయాల కోసం చేపట్టినదిగా ప్రెస్లర్‌ అభివర్ణించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement