భారత దంపతుల అనుమానాస్పద మృతి | indian couple suspicious death | Sakshi
Sakshi News home page

భారత దంపతుల అనుమానాస్పద మృతి

Apr 4 2015 1:36 AM | Updated on Sep 2 2017 11:48 PM

శ్రీలంకలోని ఒక హోటల్ గదిలో అనుమానాస్పదరీతిలో మరణించిన భారతీయ దంపతుల మృతదేహాలను శుక్రవారం పోలీసులు గుర్తించారు.

కొలంబో: శ్రీలంకలోని ఒక హోటల్ గదిలో అనుమానాస్పదరీతిలో మరణించిన భారతీయ దంపతుల మృతదేహాలను శుక్రవారం పోలీసులు గుర్తించారు.  పురుషుని వయసు 30 ఏళ్లు, మహిళ వయసు 27 ఏళ్లు ఉండవచ్చని తెలిపారు. కొలంబో సమీపంలోని వెల్లవెట్టాలో ఉన్న ఈ హోటల్‌లో మార్చి 27 నుంచి వీరు ఉంటున్నారని తెలిపారు.  మృతుల బంధువులెవరూ లేకపోవడంతో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించలేదని, మృతురాలి తల్లిదండ్రులకు సమాచారమిచ్చినట్లు పోలీసులు తెలిపారు. గురువారం రాత్రినుంచి వీరు బయటకు రాకపోవడంతో హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement