పాక్ చెరలో భారత సైనికుడు! | Indian soldier in pakisthan prison | Sakshi
Sakshi News home page

పాక్ చెరలో భారత సైనికుడు!

Published Fri, Sep 30 2016 1:13 AM | Last Updated on Sat, Mar 23 2019 8:40 PM

Indian soldier in pakisthan prison

ముజఫరాబాద్: భారత దాడులను పాక్ తిప్పికొట్టిందని పాక్‌కు చెందిన డాన్ పత్రిక తెలిపింది. ప్రతిదాడుల్లో ఓ భారత జవానును బందీగా పట్టుకోగా ఎనిమిది మందిని చంపేసినట్లు తెలిపింది. భారత దాడుల్లో ఇద్దరు పాక్ జవాన్లు మృతిచెందారని పేర్కొంది. బందీగా పట్టుకున్న జవాను మహారాష్ట్రకు చెందిన చందు బాబూలాల్ చౌహాన్(22) అని తెలిపింది. అయితే ఈ వార్త నిజం కాదని భారత్ పేర్కొంది.  ఇస్లామాబాద్‌లో భారత హైకమిషనర్ గౌతమ్ బాంబావాలేను పిలిపించిన పాక్ విదేశాంగ శాఖ..  భారత దాడులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇకపై వీటిని దాడులను సహించేది లేదని, సరైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement