Indian soldier
-
1,117 బోర్డర్ పోస్టులకు అత్యాధునిక 4జీ కమ్యూనికేషన్.. కారణం ఇదేనా..
దేశసరిహద్దుల్లో సేవలందిస్తున్న జవానులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. కొండ ప్రాంతాలు, లోయలు ఉండడంతో వారికి నెట్వర్క్ కనెక్టవిటీ సమస్య ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు 2020లో చైనాతో జరిగిన సరిహద్దు వివాదం నేపథ్యంలో అక్కడి బలగాలతో మరింత కనెక్టివిటీ ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా పొరుగుదేశాలతో సరిహద్దులు పంచుకుంటున్న ప్రాంతాల్లోని దాదాపు 1,117 బోర్డర్ పోస్టులకు అత్యాధునిక 4జీ మొబైల్ కమ్యూనికేషన్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. వీటిల్లో కొన్ని సాయుధ దళాలకు చెందిన ఇంటెలిజెన్స్ పోస్టులు కూడా ఉండనున్నాయి. అయితే ఇందుకు దాదాపు రూ.1,545 కోట్లు అవసరం అవుతాయని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో టెలికాం శాఖ, హోంశాఖ, బీఎస్ఎన్ఎల్ మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్రం చేపట్టిన 4జీ సాచురేషన్ ప్రాజెక్టులో భాగంగా లద్దాఖ్‌లో మొత్తం 379 గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం వీటిల్లో తొమ్మిది గ్రామాల్లోనే పనులు పూర్తయ్యాయి. మరో 34 చోట్ల ప్రారంభమయ్యాయి. మయన్మార్‌తో 2.4 కి.మీ, పాక్‌తో ఉన్న 18 కి.మీ సరిహద్దులో గతేడాది ఫెన్సింగ్ పని కూడా పూర్తి చేశారు. 2023లో చైనా సరిహద్దుల్లో కొత్తగా 48.03 కిలోమీటర్ల రోడ్డు నిర్మించారు. దీంతోపాటు నాలుగు ఔట్ పోస్టులు, మూడు హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. చైనాతో భారత్‌కు దాదాపు 3,488 కిలోమీటర్ల మేరకు సరిహద్దు ఉంది. ఇదీ చదవండి: నేటి నుంచి రాబోతున్న కీలక మార్పులు ఇవే.. భారత్-చైనా సరిహద్దులో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. నిత్యం ఏదో కారణంగా ఇరుదేశాల సైనికులు మోహరించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకుంటోంది. అక్కడి ప్రాంతాల పేర్లను మారుస్తూ చైనా వివాదాలకు తెర తీస్తోంది. విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న ఆ దేశం సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక, సైనిక వసతుల కల్పనకు పెద్దయెత్తున నిధులు వెచ్చిస్తోంది. సరిహద్దు గ్రామాలను అభివృద్ధి చేయడం ద్వారానే డ్రాగన్ దూకుడుకు ముకుతాడు వేయవచ్చని ఇండియా బలంగా విశ్వసిస్తోంది. అందులో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. -
సైన్యాధికారిణిగా గల్వాన్ అమరుని అర్ధాంగి
న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో చైనా సైన్యంతో ఘర్షణల్లో అమరుడైన భారత సైనికుడు నాయక్ దీపక్ సింగ్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన సతీమణి సైతం కదనరంగంలోకి దూకారు. చెన్నై కేంద్రంగా పనిచేసే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ)లో విజయవంతంగా ఆర్మీ శిక్షణ పూర్తిచేసుకున్నాక 29 ఏళ్ల లెఫ్టినెంట్ రేఖా సింగ్.. ఆర్మీ ఆర్డ్‌నన్స్ కోర్ విభాగంలో శనివారం విధుల్లో చేరారు. తూర్పు లద్దాఖ్‌లో ఫ్రంట్‌లైన్ యూనిట్లో ఆమె కర్తవ్య దీక్షను మొదలుపెట్టారని ఆర్మీ ఉన్నతాధికారులు చెప్పారు. ఆర్మీ మెడికల్ కోర్లో సభ్యుడైన నాయక్ దీపక్ సింగ్ ఆ తర్వాతికాలంలో బిహార్ రెజిమెంట్ 16వ బెటాలియన్‌లో నర్సింగ్ అసిస్టెంట్‌గా చేరారు. 2020 జూన్‌లో గల్వాన్‌లోయలో చైనా సైనికులతో పోరాడింది ఈ బెటాలియన్ బృందమే. ఘర్షణల్లో గాయపడినా కూడా నాయక్ తోటి 30 మంది క్షతగాత్రులైన సైనికులకు అత్యవసర వైద్యసాయం చేసి అద్భుత ధైర్యసాహసాలు ప్రదర్శించారని నాడు కేంద్రం శ్లాఘించింది. -
వచ్చేస్తున్నాడు తొలి సూపర్ సోల్జర్..
-
రాహుల్‌పై మండిపడ్డ జవాన్ తండ్రి
‘భారత సైన్యం పూర్తి శక్తి సామర్థ్యాలతో పనిచేస్తోంది. చైనా చర్యలను భారత్ సమర్ధవంతంగా ఎదుర్కోగలదు. రాహుల్.. ఈ విషయంలో రాజకీయాలు చెయ్యొద్దు’ అని గల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణలో గాయపడిన భారత సైనికుడు సురేంద్ర సింగ్ తండ్రి బల్వంత్ సింగ్ అన్నారు. తన కొడుకు ఇప్పటి వరకు సైన్యంలో పోరాడడని.. ఇక ముందు కూడా పోరాటం కొనసాగిస్తాడని రాహుల్ గాంధీని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. గాయాల నుంచి తన కొడుకు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు బల్వంత్ సింగ్ శనివారం వీడియో రూపొందించి మాట్లాడారు. (మోదీ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ చిదంబరం) కాగా గల్వాన్ లోయ వద్ద భారత్- చైనా సైనికుల మధ్య జరిగిన ఘటనపై రాహుల్ గాంధీ స్పందిస్తూ చైనా దురాక్రమణకు తలొగ్గిన నరేంద్ర మోదీ భారత భూభాగాన్ని చైనాకు అప్పజెప్పారని ఆరోపించారు. అలాగే ప్రధాని మోదీని కాపాడేందుకు కేంద్ర మంత్రులు అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇందుకు బల్వంత్ ఇంతకముందు మాట్లాడిన ఓ వీడియోను రాహుల్ తన ట్విటర్లో షేర్ చేశారు. (రాహుల్-అమిత్ షా మధ్య ట్విటర్ వార్) అయితే అదే బల్వంత్ తాజాగా మరో వీడియో తీసి భారత సైన్యం బలమైనదని, చైనాలను ఓడించగలదన్నారు. రాహుల్.. గల్వాన్ ఘటనను రాజకీయం చేయొద్దు అంటూ సూచించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక బల్వంత్ సింగ్ మాట్లాడిన వీడియోను హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం షేర్ చేశారు. సైనికుడి తండ్రి రాహుల్‌కు స్పష్టమైన సందేశం ఇచ్చారని, అంతేగాక ఇలాంటి చిల్లర రాజకీయాల నుంచి ఎదగాలని హితవు పలికారు. దేశమంతా ఏకతాటిపై నిలిచిన ఈ సమయంలో రాహుల్ మరింత సంఘీభావంతో మెలగాలని సూచించారు. ('చైనా దురాక్రమణకు మోదీ లొంగిపోయారు) -
ఆయన గొంతు విన్నాక.. కన్నీళ్లు ఆగలేదు!
పట్నా: ‘‘ఆయన గొంతు విన్నాక కన్నీళ్లు ఆగలేదు. ఆనందం పట్టలేకపోయాను. అవును.. అది రోషిణి వాళ్ల నాన్న గొంతే’’ అంటూ భారత ఆర్మీ జవాను సునీల్ కుమార్ భార్య మేనక ఉద్వేగానికి లోనయ్యారు. తన భర్త బతికే ఉన్నాడన్న వార్త తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. తూర్పు లడఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో సోమవారం రాత్రి చైనా బలగాలతో జరిగిన ఘర్షణల్లో 20 మంది సైనికులు వీర మరణం పొందిన విషయం విదితమే. తొలుత ఈ ఘటనలో కల్నల్ సహా ఇద్దరు జవాన్లు మరణించారని వెల్లడించిన ఆర్మీ.. ఆపై తీవ్రంగా గాయపడిన మరో 17 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని బుధవారం వారి పేర్లను విడుదల చేసింది. (విషం చిమ్మిన చైనా..) ఈ క్రమంలో బిహార్‌కు చెందిన సునీల్ కుమార్ అసువులు బాసినట్లుగా ఆర్మీ నుంచి ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో వారంతా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. సునీల్ కుమార్ త్యాగాన్ని కీర్తిస్తూ స్థానికులంతా ఆయన నివాసానికి చేరుకుని కుటుంబాన్ని ఓదార్చారు. వీర జవానుకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఆర్మీ నుంచి వచ్చిన మరో ఫోన్ కాల్ వారి ముఖాల్లో ఆనందాన్ని నింపింది.(‘ఇద్దరు మనుమలనూ సైన్యంలోకి పంపుతా’) సరిహద్దు ఘర్షణలో మరణించిన వేరే జవాను కుటుంబానికి బదులు పొరబాటున సునీల్ గ్రామానికి ఫోన్ చేసినట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ సునీల్ కుమార్ భార్య మేనక మాత్రం షాక్ నుంచి తేరుకోకపోవడంతో.. ఆర్మీలోనే పనిచేస్తున్న ఆయన సోదరుడు అనిల్ ద్వారా మరోసారి సమాచారాన్ని చేరవేశారు. బుధవారం మధ్యాహ్నమే తనకు ఈ విషయం తెలిసిందని ఆమెను ఓదార్చాడు. అనంతరం కాన్పరెన్స్ కాల్లో మేనక సునీల్‌తో మాట్లాడే విధంగా ఆర్మీ అధికారులు గురువారం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో వారి కుటుంబంలో అలుముకున్న విషాదం తొలగిపోయి.. ఆనందం వెల్లివిరిసిందని హిందీ డైలీ హిందుస్థాన్ తెలిపింది. -
చంపేయమని పాక్ సైనికులకు చెప్పాను
న్యూఢిల్లీ: తనను చంపేయమని పాకిస్థాన్ సైనికులకు చెప్పానని ఆ దేశంలో బందీగా ఉండి, ఇటీవల విడుదలైన భారత సైనికుడు చందూ బాబూలాల్ చవాన్ చెప్పారు. తనను చిత్రహింసలకు గురిచేశారని, తన జీవితం అక్కడే ముగిసి పోతుందని భావించానని, తనను చంపేయాల్సిందిగా పాక్ సైనికులకు చెప్పానని చవాన్ తెలిపారు. వేధింపులు భరించలేక తనకు చావు ప్రసాదించమని దేవుణ్ని ప్రార్థించేవాడినని చెప్పారు. జమ్ము కశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద చవాన్ విధులు నిర్వహిస్తున్నారు. ఉరిలోని భారత సైనిక శిబిరంపై ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత, గతేడాది సెప్టెంబర్ 29న భారత సైనికులు నియంత్రణ రేఖ అవతల ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశారు. అదే రోజున 22 ఏళ్ల చవాన్ నియంత్రణ రేఖ దాటి పాక్ భూభాగంలోకి వెళ్లారు. పాకిస్థాన్ సైనికులు ఆయన్ను పట్టుకుని బందించారు. నాలుగు నెలల తర్వాత జనవరి 21న పాక్ సైనికులు.. చవాన్‌ను భారత్‌కు అప్పగించారు. పాక్ సైనికుల కస్టడీలో అనుభవించిన కష్టాలను చవాన్.. ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'నేను పాక్ సైనికులకు చిక్కిన తర్వాత వారు నన్ను తనికీ చేశారు. నా దుస్తులు తీసుకున్నారు. నాపై నల్లటి దుస్తులు వేసి, ఓ వాహనంలో తీసుకెళ్లారు. ఓ చీకటి గదిలో నన్ను బంధించారు. బాత్రూమ్, టాయ్‌లెట్ కూడా అదే గదిలో ఉన్నాయి. నాకు ఇంజెక్షన్లు వేసి, కొట్టేవారు. చెవిలో డ్రాప్స్ వేయడంతో రక్తం వచ్చేది. ఏం చేయాలో అర్థంకాలేదు. తల బాదుకునేవాణ్ని. నన్ను చంపేయమని వారికి చెప్పాను. రాత్రా పగలా అన్న విషయం కూడా తెలిసేది కాదు. ఆ సమయంలో నా కుటుంబం గుర్తుకు వచ్చి దుఃఖం వచ్చేది. నాకు చావు ప్రసాదించమని దేవుణ్ని కోరుకునేవాణ్ని' అని చెప్పారు. -
బండారం బయటకు.. పాక్ ఇప్పుడేమంటుందో
న్యూఢిల్లీ: భారత సైనికుడిని తాము చంపలేదంటూ బొంకిన పాకిస్థాన్ బండారం బయటపడింది. పాక్‌కు చెందిన ఉగ్రవాదులే ఆ పనిచేశారని నిరూపించేలా భారత సైన్యం ఆధారాలు కూడా సేకరించింది. పాకే ఈ నేరం చేసిందని వాటిని చూపిస్తూ కుండబద్ధలు కొట్టింది. ఈ నెల 22న భారత సైన్యం పాక్ ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ఓ భారత సైనికుడిని ఉగ్రవాదులు దారుణంగా చంపేశారు. మొండెం నుంచి తలను వేరు చేశారు. అయితే, మృతదేహంతోపాటు భారత ఆర్మీ పలు వస్తువులను కూడా స్వాధీనం చేసుకుంది. ఘటన స్థలి వద్ద పాక్ మార్కింగ్‌తో ఉన్న ఆహార పదార్థాల పొట్లాలు, గ్రనేడ్లు, రాత్రి పూట చూసే అమెరికా బ్రాండ్‌కు చెందిన టెలిస్కోపులు, రేడియో సెట్లు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకొని పాక్ ప్రతి స్పందన తెలియజేసిన తర్వాత చెంపపెట్టులా మీడియాకు, అంతర్జాతీయ సమాజానికి చూపించారు. దీనిపై ఇప్పుడు పాక్ ఏం సమాధానం చెబుతోంది చూడాలి. -
పాక్ చెరలో భారత సైనికుడు!
ముజఫరాబాద్: భారత దాడులను పాక్ తిప్పికొట్టిందని పాక్‌కు చెందిన డాన్ పత్రిక తెలిపింది. ప్రతిదాడుల్లో ఓ భారత జవానును బందీగా పట్టుకోగా ఎనిమిది మందిని చంపేసినట్లు తెలిపింది. భారత దాడుల్లో ఇద్దరు పాక్ జవాన్లు మృతిచెందారని పేర్కొంది. బందీగా పట్టుకున్న జవాను మహారాష్ట్రకు చెందిన చందు బాబూలాల్ చౌహాన్(22) అని తెలిపింది. అయితే ఈ వార్త నిజం కాదని భారత్ పేర్కొంది. ఇస్లామాబాద్‌లో భారత హైకమిషనర్ గౌతమ్ బాంబావాలేను పిలిపించిన పాక్ విదేశాంగ శాఖ.. భారత దాడులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇకపై వీటిని దాడులను సహించేది లేదని, సరైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పింది. -
యూరి 'ఉగ్ర'దాడి.. సైనికుడి వైరల్ వీడియో!
18 మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న యూరి ఉగ్రవాద దాడి యావత్ భారతాన్ని దిగ్భ్రాంత పరిచింది. పాకిస్థాన్ నుంచి వచ్చిన ముగ్గురు ఆత్మాహుతి దళ ఉగ్రవాదులు తలపెట్టిన ఈ నరమేధంలో మరో 18మంది జవాన్లు గాయపడ్డారు. ఈ అమానుష హింసాత్మక ఘాతుకంపై భారత్ తోపాటు యావత్ ప్రపంచం ఆగ్రహం, ఆక్రోశం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఓ భారతీయ సైనికుడు భావోద్వేగంగా ఆలపించిన దేశభక్తి గీతం వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను కుదిపేస్తున్నది. 'కశ్మీర్ ఉంటుంది కానీ, పాకిస్థానే ఉండదు' (కశ్మీర్ తో హోగా, లేకిన్ పాకిస్తాన్ నహి హోగా' అంటూ వీరోచితంగా కవితాగానం చేస్తూ.. తనతోపాటు బస్సులో ప్రయాణిస్తున్న సాటి సైనికులను ఉత్సాహపరుస్తున్న ఈ వీడియో చూపరుల రోమాలను నిక్కబొడిచేలా చేస్తోంది. దేశభక్తి నరనరాన జీర్ణించుకున్న సైనికుల మొక్కవోనీ త్యాగాలను కీర్తిస్తూ సాగిన ఈ కవితను విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) యువ వక్త అయిన సాధ్వీ బాలికా సరస్వతి రచించారు. 'సింహాల పిల్లలు తోడేళ్లకు భయపడవు. భారతదేశ పరంపర వల్లే కానీ పాకిస్థాన్ కు సొంతంగా గుర్తింపు లేదు' అంటూ వీరోచితంగా సాగిన ఈ వీడియోను ఇప్పుడు వేలమంది తిలకిస్తున్నారు. 'పాకిస్థాన్ శ్రద్ధగా విను. యుద్ధమంటూ వచ్చిందంటే నీ నామరూపాలు ఉండవు. కశ్మీర్ ఉంటుందని కానీ పాకిస్థానే ఉండదు' అంటూ సాగిన ఈ వీడియోను ఎప్పుడు రికార్డు చేశారో తెలియదు కానీ, యూరి ఉగ్రవాద దాడి అనంతరం భారత సైనికులు రగిలిపోతున్న నేపథ్యంలో ఆన్ లైన్ లో దర్శనమివ్వడంతో ఒక్కసారిగా వైరల్ గా మారిపోయింది. -
బంకర్ కు నిప్పంటుకుని సైనికుడు మృతి
శ్రీనగర్: నియంత్రణ రేఖ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో ఓ సైనికుడు చనిపోగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటన జమ్మూ, కాశ్మీర్ లోని కుప్వారా వద్ద జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. తూట్ మార్ గలి ప్రాంతంలోని నవ్ గాం సెక్టర్ లోని నియంత్రణ రేఖ వద్ద బంకర్ కు నిప్పంటుకోవడంతో జాట్ రెజిమెంట్ కు చెందిన భారత సైనికుడు, మరో ఇద్దరు మరణించారని అధికారి తెలిపారు. గాయపడిన ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదం జరిగినపుడు బంకర్ లో కిరోసిన్, కోక్ హీటర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. -
భారత్ - పాక్ సరిహద్దులో కాల్పులు
-
ఫిరోజ్ కుటుంబానికి మొండి చేయి!
సాక్షి, హైదరాబాద్: దేశం కోసం పోరాడుతూ పాకిస్థాన్ సరిహద్దుల్లో గత నెల 15న ప్రా ణాలర్పించిన అమరవీరుడు లాన్స్ నాయక్ మహ్మద్ ఫిరోజ్‌ఖాన్ కుటుంబానికి ప్రభుత్వం ఇప్పటికీ ఎక్స్‌గ్రేషియా ఇవ్వనే లేదు. 6 నెలల క్రితం పాకిస్థాన్ సరిహద్దుల్లో అమరుడైన మహబూబ్‌నగర్ జిల్లా వాసి కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల స్థలం ఇచ్చింది. అమరవీరుడు ఫిరోజ్ కుటుంబానికి మాత్రం ప్రభుత్వం రూ.లక్ష పంపింది. అయితే, రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల స్థలం ఇస్తామని రాష్ట్ర మంత్రి డీ కే అరుణ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ రూ. లక్షను తిరస్కరించామని ఫిరోజ్ తల్లి అక్తర్ బేగం ‘సాక్షి’తో చెప్పారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను కోరామని ఫిరోజ్ మామ మొయినుద్దీన్ తెలిపారు. తన కొడుకు దేశం కోసం పోరాడి ప్రాణాలర్పించాడని, అతనికి ఇస్తున్న గౌరవం ఇదేనా అని అక్తర్ బేగం ప్రశ్నించారు. కాగా, ఈ విషయమై జిల్లా సైనిక సంక్షేమ అధికారి ప్రవీణ్ కూమార్ను సంప్రదించగా.. మానిటరింగ్ ఫండ్ రూపంలో గత వారం జిల్లా కలెక్టర్ రూ.లక్షను జిల్లా సైనిక బోర్డుకు అందజేశారన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా వాసి కుటుంబానికి ఇచ్చినట్లే ఫిరోజ్ కుటుంబానికీ సాయం అందించాలని జిల్లాకలెక్టర్‌కు నివేదించామని, ఈ వినతిని జిల్లా కలెక్టర్ రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శికి పంపారన్నారు.