మలేసియాలో భారత కార్మికుడు మృతి | Indian worker dies in Malaysia after heart stroke | Sakshi
Sakshi News home page

మలేసియాలో భారత కార్మికుడు మృతి

Published Tue, Jun 7 2016 3:49 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

Indian worker dies in Malaysia after heart stroke

బతుకుదెరువు కోసం మలేసియా వెళ్లిన తెలంగాణ యువకుడు కలవ బాలకృష్ణ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయం తెలియని అతని కుటుంబసభ్యులు కలవ బాలకృష్ణ నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో మలేషియా తెలుగు ప్రవాసితుల సంఘం(టీమ్)కి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

దీంతో చర్యలు చేపట్టిన టీమ్ కౌలాంలంపూర్ కు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోట తిగ్గిమ్ ఆసుపత్రిలో ఉన్న బాలకృష్ణ మృత దేహాన్ని మలేసియా, భారతీయ ఎంబసీల సాయంతో హైదరాబాద్ కు పంపించే ఏర్పాట్లు చేశారు. బాలకృష్ణ సొంత ఊరు తెలంగాణలోని నిజామాబాద్ అని తెలిపారు. శవాన్ని దేశానికి పంపేందుకు అయ్యే ఖర్చులను సంఘం సభ్యులు భరిస్తున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement